ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలే: ఉత్తరాఖండ్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

Uttarakhand Minister Said Indira Rajiv Gandhis Murders Were Accidents - Sakshi

ఉత్తరాఖండ్‌ మంత్రి గణేష్‌ జోషి.. గాంధీ కుటుంబాల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీ హత్యలు కేవలం ప్రమాదాలేనని అవి బలదానాలు కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయినా బలిదానం అనేది గాంధీ కుటుంబాల గుత్తాధిపత్యం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబంలో జరిగిన ఆ రెండు హత్యలు ప్రమాదాలేనన్నారు. బలిదానానికి, ప్రమాదానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఐతే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ శ్రీనగర్‌లోని భారత్‌జోడో యాత్ర ముగింపులో ప్రసంగిస్తూ దేశ సేవలోనే తన తండ్రి, నానమ్మలు ప్రాణాలు వదిలారంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ నేపథ్యంలోనే జోషి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్‌లో రాహుల్‌ యాత్ర సజావుగా సాగడంలో ప్రధాన మంత్రి మోదీ ఘనత ఎంతో ఉందని నొక్కి చెప్పారు. అక్కడ భారత్‌ జోడో యాత్ర జయప్రదం కావడంలో ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఆయన ఆర్టికల్‌ 370ని రద్దు చేయడంతోనే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్నాయని, అందువల్లే రాహుల్‌ లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించగలిగారని జోషి అన్నారు.

కాగా రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర ముగింపు ప్రసంగంలో తన నానమ్మ, నాన్న చనిపోయారన్న దుర్వార్తను ఫోన్‌కాల్‌ ద్వారానే తెలుసుకున్నామని, నాటి ఘటనలు తలుచుకున్నా బాధగ అనిపిస్తుందని చెప్పారు. హింసను ప్రేరేపించే ప్రధాని మోదీ, అమిత్‌ షాలకు ఆ భాద ఎప్పటికీ అర్థంకాదని రాహుల్‌ అన్నారు. ఈ బాధ కేవలం ఒక ఆర్మీ మనిషికే అర్థమవుతుంది. పుల్వామాలో మరణించిని సీర్పీఎఫ్‌ జవాన్ల కుటుంబాలకి అవగతమవుతుంది. ఆ విషాద ఘటనల తాలుకా కాల్స్‌ ఎలా ఉంటాయో కాశ్మీరులు కూడా బాగా అర్థం చేసుకోగలరని అన్నారు రాహుల్‌ గాంధీ.

(చదవండి: భారత్ జోడో యాత్ర లక్ష్యం నెరవేరింది.. ప్రజల బాధలు విని కన్నీళ్లు పెట్టుకున్నా.. ముగింపు సభలో రాహుల్.)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top