
డెహ్రాడూన్: కుమావన్ ప్రాంతంలోని సాల్ అడవుల్లో పెరిగే 34 రకాల పుట్టగొడుగు జాతులను ఉత్తరాఖండ్ అటవీ శాఖ పరిశోధన విభాగం గుర్తించింది. వాటిపై పరిశోధన జరిపిలో 14 రకాలు జాతుల పట్టగొడుగులు మాత్రమే తినదగినవిగా గుర్తించారు. అయితే పుట్టగొడుగులపై సాల్ అడవుల్లోని అయిదు వేర్వేరు ప్రదేశాల్లో గత మూడు నెలలుగా అధ్యయనం జరుపుతున్నామని అటవీ శాఖ పేర్కొంది. అందులో మూడు నైనిటాల్ జిల్లాలో, మరో రెండు ఉధమ్ సింగ్ నగరంలో ఉన్నట్లు చెప్పారు. ఈ అధ్యయనంలో భాగంగా సాల్ అడవుల్లో 34 జాతుల పుట్టగొడుగులను సేకరించినట్లు పరిశోధన విభాగం జూనియర్ రిసెర్చ్ ఫెలోస్ కిరణ్ బిష్ట తెలిపారు. వీటిలో కేవలం 14 జాతులు మాత్రమే తినదగినవని ఆయన వెల్లడించారు. వీటిలో టెర్మిటోమైసెస్, జిలేరియా హైపోక్సిలాన్ మొదలైన పుట్టగొడుగులను స్థానిక ప్రజలు అత్యంత ఎక్కువగా తింటుంటారని ఆయన వెల్లడించారు. అంతేగాక ఈ పుట్టగొడుగులపై స్థానిక ప్రజలకు మంచి అవగాహన ఉందని మరో పరిశోధకుడు జ్యోతి ప్రకాష్ తెలిపారు. వారు తరచూ ఈ అడవుల్లో తిరగడం వల్లే వీటిపై అవగాహన పెరిగిందని వివరించారు. (చదవండి: రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి)
ఈ పుట్టగొడుగులను స్థానిక ప్రజలు రుతుపవనాల సమయంలో మార్కెట్లలో విక్రయిస్తున్నందున ఈ అధ్యయనం వారికి ఉపయోగిపడటమే కాకుండా పుట్టగోడుగులపై మరింత అవగాహన పెరిగే అవకాశం ఉందన్నారు. పుట్టగొడుగులు మంచి ఆహారమే కాకుండా ఆదాయ వనరుగా ఉపయోగిపడుతున్నాయన్నారు. బటన్ తరహా పుట్టగొడుగులు కిలోకు 150 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఉందని జ్యోతీ ప్రకాష్ తెలిపారు. ఈ రీసెర్చ్‌ను అటవీ పరిశోధన విభాగం జూనియర్ రిసెర్చ్ ఫెలోస్ ఆధ్వర్యంలో జరుపుతున్నారు. కిరణ్ బిష్ట, జ్యోతి ప్రకాష్‌లతో పాటు తనూజా పాండే, కనిష్ కుమార్(ఫారెస్ట్ గార్డు)లు పుట్టగొడుగులపై అధ్యయనం చేస్తున్నారు. వారు గుర్తించిన కొన్ని తినదగిన పుట్టగొడుగులలో కోప్రినెల్లస్ డిసెమినాటస్, కోప్రినస్ కోమాటస్, హైగ్రోసైబ్ కాంటారెల్లస్, రుసుల్లా బ్రీవిప్స్, మాక్రోలెపియోటా ప్రోసెరా, గానోడెర్మా లూసిడమ్, కోప్రినెల్లస్ మైకేసియస్ మొదలైనవి ఉన్నాయని తనూజా పాండే వెల్లడించారు. (చదవండి: ఇలాంటి స్పైడర్ ఎప్పుడైనా చూశారా..)