ఇదేమి స్పైడర్‌ రా నాయనా..

Australian Woman Spots New Spider With Vibrant Blue Face And 8 Eyes - Sakshi

మనకు తెలిసిన స్పైడర్‌కు ‌(సాలెపురుగు) ఒక కన్ను.. ఎనిమిది కాళ్లు ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ ఒక స్పైడర్‌కు మాత్రం ఎనిమిది కాళ్లతో పాటు ఎనిమిది కళ్లు ఉండడం కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే దీనిని చూడాలంటే మాత్రం ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిందే. ఎందుకంటే అమండా డీ జార్జ్‌ అనే మహిళ సౌత్‌ సిడ్నీలోని తిర్రోల్‌లో దీనిని కనుగొంది. (చదవండి : నోబెల్‌ : నూట ఇరవై ఏళ్లలో నలుగురు)

18 నెలల కిందట అమండా ఈ స్పైడర్‌ను తొలిసారి చూసింది. కానీ అప్పడు ఆమెకు దానిని ఫోటో తీయడం సాధ్యపడలేదు. మళ్లీ జూన్‌లో అమండా కళ్లలో పడ్డ ఆ సాలీడును ఈసారి మాత్రం మిస్సవలేదు. కెమెరా తీసుకొని చకచకా నాలుగు ఫోటోలు తీసి వెంటనే నిపుణుడికి పంపించింది. ఆ తర్వాత అమండా స్పైడర్‌ ఫోటోలను బ్యాక్‌యార్డ్‌ జువాలజీ ఫేస్‌బుక్‌ పేజీలో అప్‌లోడ్‌ చేసింది. ' ఫోటోలోని సాలీడు నాకు నిద్రపట్టకుండా చేసింది. నేను చూసిన స్పైడర్‌కు ఎనిమిది కళ్లు ఉండడంతో పాటు ముఖం కూడా నీలిరంగులో ఉంది. అది నానుంచి తప్పించుకోవాలని చూసింది.. కానీ ఈసారి మాత్రం మిస్సవకుండా ఫోటో తీయగలిగాను. ఫోటో తీసే సమయంలో సాలీడు నావైపై చూసినట్టుగా అనిపించింది. ఇలాంటి అరుదైన దృశ్యాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తాయి.' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top