
త్రిసూర్: ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ తరఫున కేరళ నుంచి గెలిచిన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలపై ప్రశంసలు కురిపిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
కాంగ్రెస్‌కు చెందిన మాజీ ప్రధాని ఇందిరను ఆయన భారత మాత(మదర్ ఆఫ్ ఇండియా)గాను, కేరళ దివంగత సీఎం కె.కరుణాకరన్‌ను సాహసోపేతుడైన పాలకుడిగాను అభివర్ణించారు. త్రిసూర్ జిల్లా పుంకున్నమ్‌లో ఉన్న కరుణాకరన్ సమాధి ‘మురళి మందిరం’ను సురేశ్ గోపీ ఇటీవల సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన గురువుకు నివాళులర్పించేందుకే ఇక్కడికి వచ్చానని, దీనిని రాజకీయం చేయొద్దంటూ కోరారు.