సహకార వ్యవస్థ బలోపేతం కోసం..కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం

Union Cabinet Key Decision On strengthen cooperative sector - Sakshi

సాక్షి, ఢిల్లీ:  కేంద్రం మంత్రివర్గం ఇవాళ(బుధవారం) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో సహకార వ్యవస్థను బలోపేతం చేయాలనే ప్రధాన నిర్ణయానికి కేబినెట్‌ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ మేరకు కేబినెట్‌ భేటీ వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్‌ థాకూర్‌ మీడియాకు వివరించారు.

ప్రతీ పంచాయతీలో వ్యవసాయ సహకార సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ మొగ్గుచూపింది. దీని ప్రకారం.. ప్రతీ గ్రామ పంచాయతీలో ఒక పీఏసీఎస్‌(Primary Agricultural Credit Society) ఏర్పాటుకు నిర్ణయించుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. మొత్తంగా రాబోయే ఐదేళ్లలో మొత్తంగా రెండు లక్షల పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top