
ఆపిల్ ఫ్యాక్టరీలో విధ్వంసం: రాజకీయ ప్రకంపనలు..
కర్ణాటక కోలార్ జిల్లాలోని ఆపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగుల విధ్వంసం ప్రకంపనలు రేపుతోంది. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్ పై దాడిచేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు..
తప్పుడు ప్రచారాలపై సీఎం జగన్ ఆగ్రహం
రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించేలా పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..
మన్యంలో మావోయిస్టుల ఘాతుకం
జిల్లాలోని సింహాచలం ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్‌గా అనుమానించి గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జి.మాడుగుల మండలం వాక పల్లె గ్రామం సోమవారం జరిగింది. కృష్ణారావును హత్య చేసి మావోయిస్టులు అక్కడ ఒక లేఖనును వదిలి వెళ్లారు. పూర్తి వివరాలు..
టీపీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం!
తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. ఇప్పటివరకు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామని అన్నారు. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తెలుసుకున్నామని ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో పేర్కొన్నారు. పూర్తి వివరాలు..
‘తెలంగాణలో నయా రాచరికం’
తెలంగాణలో పాలన అంతా అయోమయంగా సాగుతోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులను, ఇటు ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ నుంచి నయా రాచరిక పాలన చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పూర్తి వివరాలు..
రానున్న 4-6 నెలలు జాగ్రత్త: బిల్ గేట్స్..
రానున్న 4-6 నెలల్లో కరోనా వైరస్ మరిన్ని సవాళ్లు విసరవచ్చని గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ తాజాగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అనారోగ్య సమస్యలు సృష్ఠిస్తున్న వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడం వంటివి విధిగా చేయవలసి ఉన్నట్లు నొక్కి చెప్పారు. లేదంటే వైరస్ మరింత విజృంభించవచ్చని, దీంతో మరణాల సంఖ్య సైతం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు..
ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!
ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో ప్రజలు బాగా వెతికే వాటిలో టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. పూర్తి వివరాలు..
తప్పయిపోయింది మహాప్రభో, క్షమించండి..
దివంగత నటుడు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ విష్ణువర్థన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగు నటుడు విజయ్ రంగరాజు క్షమాపణలు కోరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్థన్‌ను ఎకవచనంలో సంబోధిస్తు.. అవమానకర రీతిలో పదజాలాన్ని వాడారు. దీంతో కన్నడ ప్రజలు, హీరో విష్ణువర్థన్ అభిమాన సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు..
ఎన్నికల బరిలోకి మరో స్టార్ హీరో!
తమిళ సినీ హీరో విశాల్ త్వరలోనే పోలీటికల్ ఎంట్రి ఇవ్వబోతున్నాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పోటీ చేసి గెలుపోందిన విషయం తెలిసిందే. ప్రైవేటు రంగంలో రెండు కీలక పదవులు చేపట్టి సత్తా చాటుకున్న విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.. పూర్తి వివరాలు..
చిర్రెత్తిపోయింది.. అందుకే హిట్టింగ్‌కు దిగా..
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భాగంగా టీమిండియా-ఆసీస్ ’ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ను భారత్ గెలుస్తుందని భావించినా ఆసీస్ ’ఎ’ ఆటగాళ్ల పోరాటంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ ఇక్కడ భారత్‌కు మంచి ప్రాక్టీస్ లభించింది. టెస్టు సిరీస్‌కు జట్టును ఎలా ఎంపిక చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రధానంగా రిషభ్ పంత్‌ను ఎంపిక చేయాలా.. వద్దా అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు..