ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్‌ ఫోన్స్ ఇవే!

Top Trending Phones Of This Week - Sakshi

ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో ప్రజలు బాగా వెతికే వాటిలో టాప్-10 ట్రెండింగ్‌లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. ఈ వారంలో కొత్తగా రాబోయే శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21ప్లస్ 5జీ మొబైల్ ను తెగ వెతికేయడం వల్ల ఇది మొదటి స్థానంలో నిలిచింది. అలాగే కొత్తగా రాబోయే ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీని ఎక్కువగా సెర్చ్ చేయడం వల్ల 2వ స్థానంలో నిలిచింది. గత వారంలో 2వ స్థానంలో నిలిచిన షియోమీ రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ ఈసారి మూడవ స్థానంలో ఉంది. (చదవండి: పబ్జి లవర్స్ జర జాగ్రత్త!)

అదేవిదంగా గతవారంలో మొదటి స్థానంలో ఉన్న షియోమీ పోకో ఎమ్3 3 స్థానాలు కోల్పోయి 4వ స్థానంలో నిలిచింది. కొత్తగా రాబోయే శామ్‌సంగ్ గెలాక్సీ ఎ52 5జీ మొబైల్ ఐదవ స్థానంలోను, కొత్తగా వచ్చే శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 5జీ 6వ స్థానంలో నిలిచాయి. గత వారం 3వ స్థానంలో నిలిచినా ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్ ఈసారి ఏడవ స్థానంలో నిలిచింది. అలాగే గతవారం 5,4,7 స్థానాలలో నిలిచిన షియోమీ రెడ్‌మి నోట్ 9 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ51, షియోమీ ఎంఐ 10టీ ప్రో 5జీ మొబైల్స్ ఈసారి 8,9,10 స్థానాలలో నిలిచాయి.

ర్యాంక్ 1: శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21ప్లస్ 5జీ

ర్యాంక్ 2: ఒప్పో రెనో5 ప్రో ప్లస్ 5జీ

ర్యాంక్ 3: షియోమీ రెడ్‌మి నోట్ 9 ప్రో 5జీ

ర్యాంక్ 4: షియోమీ పోకో ఎమ్3

ర్యాంక్ 5: శామ్‌సంగ్ గెలాక్సీ ఎ52 5జీ

ర్యాంక్ 6: శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 5జీ

 ర్యాంక్ 7: ఆపిల్ ఐఫోన్ 12 ప్రో మాక్స్

 ​​​​​​​ర్యాంక్ 8: షియోమీ రెడ్‌మి నోట్ 9 ప్రో

​​​​​​​ర్యాంక్ 9: శామ్‌సంగ్ గెలాక్సీ ఎ51

​​​​​​ర్యాంక్ 10: షియోమీ ఎంఐ 10టీ ప్రో 5జీ
​​​​​​​

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top