టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు | Today Top News 12th December 2020 | Sakshi
Sakshi News home page

టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

Dec 12 2020 6:25 PM | Updated on Dec 12 2020 11:38 PM

Today Top News 12th December 2020 - Sakshi

న‌కిలీ వెబ్‌సైట్లను నమ్మొద్దు: టీటీడీ ఈవో
వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారాన్ని డిసెంబ‌రు 25 నుండి జ‌న‌వ‌రి 3వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు తెరిచి ఉంచి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌భాగ్యం క‌ల్పిస్తామని టీటీడీ ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శ‌నివారం జ‌రిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పూర్తి వివరాలు..

ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్ (‌RGUKT-CET) ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో  టాప్ టెన్‌ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు. పూర్తి వివరాలు..

కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి: కేసీఆర్‌
ఢిల్లీ పర్యటనలో భాగంగా  తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రెండోరోజు శనివారం కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరితో సమావేశం అయ్యారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు..

కాంగ్రెస్‌ను రోడ్డుపాలు చేసే కుట్ర..
టీపీసీసీ పదవిపై కాంగ్రెస్‌లో హీట్‌ పెరిగింది. తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అంశంపై అభిప్రాయసేకరణ కొనసాగుతుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్యం ఠాకూర్‌ దీనిపై గాంధీభవన్‌లో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు..

చైనా ఆరోపణలు అవాస్తవం: భారత్‌
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల అంశంలో చైనా ఆరోపణలను భారత్‌ కొట్టిపారేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి డ్రాగన్‌ చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలు అని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పూర్తి వివరాలు..

హ్యపీ బర్త్‌డే సూపర్‌స్టార్‌: మోదీ
నేడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ 70 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని తమినాడు వ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లో నేరుగా రంగ ప్రవేశం చేయనున్నట్లు గతవారం పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలు..

ట్రంప్‌కు సుప్రీం షాక్‌.. ఆధారాల్లేవ్‌
అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డొనాల్డ్ ట్రంప్.. ఓటమిని అంగికరించకుండా మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలనుకుంటున్నారు. ఇందుకోసం పోలింగ్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్‌లు వేసిన ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం తాజాగా కొట్టివేసింది. పూర్తి వివరాలు..

స‌న్నీలియోన్‌కు 20 ఏళ్ల కొడుకు? ఫ‌న్నీ రిప్లై!
బాలీవుడ్ తార‌లు ఇమ్రాన్ హ‌ష్మీ, స‌న్నీ లియోన్ ఇద్ద‌రూ కేవ‌లం ఓ పాట‌లో మాత్ర‌మే క‌లిసి న‌టించారు. కానీ వీళ్ల‌కు పెళ్లైంద‌ని, బిహార్‌కు మ‌కాం మార్చార‌ని, ఈ జోడీకి డిగ్రీ చ‌దివే కొడుకున్నాడంటూ ఈ మ‌ధ్య ఓవార్త తెగ‌ హ‌ల్‌చ‌ల్ అవుతోంది. ఇది కాస్తా స‌న్నీలియోన్ కంట‌ప‌డ‌గా ఆమె తేలిక‌గా న‌వ్వేశారు. ఆ విద్యార్థి చేసిన‌ తుంట‌రి ప‌నికి ఏమీ అన‌లేక మెచ్చుకోలుగా చ‌మ‌త్క‌రించారు. అస‌లేం జ‌రిగిందంటే.. పూర్తి వివరాలు..

వైరల్‌ : రనౌట్‌‌ తప్పించుకునేందుకే..
బిగ్‌బాష్‌ లీగ్‌ 2020లో శనివారం మెల్‌బోర్న్‌ స్టార్స్‌, సిడ్నీ థండర్స్‌ మధ్య జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ ఇన్నింగ్‌ ఆఖరి ఓవర్లో డేనియల్‌ సామ్స్‌ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్‌ లార్కిన్‌ ఫ్లిక్‌ చేశాడు. అయితే పొరపాటున బంతి లార్కిన్‌ జెర్సీలోకి దూరిపోయింది. పూర్తి వివరాలు..

అద్భుతమైన సోలార్‌ కారు..
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఉండేలా అద్భుతమైన ఓ కార్ల మోడల్‌ను తీసుకొస్తోంది. గంటకు 110 మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఈ కార్లను ఎన్నడూ 24 గంటల లోపల చార్జింగ్‌ చేయాల్సిన అవసరమే లేదట. పూర్తి వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement