ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

AP: Triple IT Entrance Exam Results Released - Sakshi

సాక్షి, విజయవాడ: రాజీవ్‌గాంధీ యూనివర్శిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్ (‌RGUKT-CET) ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో  టాప్ టెన్‌ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షలు లేని నేపథ్యంలో టెన్త్‌ సిలబస్‌ ఆధారంగానే ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. 85,755 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. జనవరి 4 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఇంటర్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన్ ప్రాసెస్‌ ఏర్పాటు చేశామన్నారు. విద్య వ్యాపారం కాకూడదనే ఆన్‌లైన్‌ విధానం తెచ్చామని తెలిపిన మంత్రి.. మౌలిక వసతులు లేని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్‌‌జ టెక్నాలజీ (ఆర్జీయూకేటీ) పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో చేరేందుకు కామన్ ఎంట్రన్‌‌స టెస్ట్ నవంబర్ 28న జరిగిన విషయం తెలిసిందే.
ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top