అద్భుతమైన ‘ఆపరేషన్‌’ నిర్వహించారు: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి | Telangana Minister Uttam Kumar Reddy Praises Indian Air Force | Sakshi
Sakshi News home page

అద్భుతమైన ‘ఆపరేషన్‌’ నిర్వహించారు: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

May 31 2025 3:50 PM | Updated on May 31 2025 4:00 PM

Telangana Minister Uttam Kumar Reddy Praises Indian Air Force

ఢిల్లీ:   పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో రాఫెల్‌ యుద్ధ విమానాలు ఏమైనా కూలిపోయాయా? అని తాము అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని తెలంగాణ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.  ఆపరేషన్‌ సిందూర్‌ రాపెల్‌ యుద్ధ విమానం కూలిపోయిందని సిడిఎస్ అనిల్ చౌహన్ మాత్రం స్పష్టం చేశారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి. ఇకనైనా భారత్‌ ప్రభుత్వం దీన్ని నిరాకరించడం మానుకోవాలననారు. 

‘ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారని ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక కాల్పుల విరమణ అంశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎలా ట్వీట్‌ చేస్తారని ప్రశ్నించారు. ఆపరేషన్‌ సిందూర్‌తో భారత ఎయిర్‌ఫోర్స్‌ విజయం పట్ల మేము గర్విస్తున్నామని, ఇదొక అద్భుతమైన ఆపరేషన్‌ అని ఉత్తమ్‌ కొనియాడారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం భారత్‌ ఎయిర్‌ఫోర్స్‌ సాధించిన విజయమన్నారు.

ఫైటర్‌ విమానాలు, ఆయుధాల సప్లయ్‌ ఆలస్యం అవుతున్నాయని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ చెప్పడం ఆందోళన కల్గిస్తోందన్నారు. చైనా, పాకిస్తాన్‌లతో ముప్పు నేపథ్యంలో భారత భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తేలికపాటి యుద్ధ విమానాల సప్లై ఆంశం కూడా ఆలస్యం అవుతుందని, అత్యవసరంగా ఈ సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు.  ఆపరేషన్ , ఆర్ అండ్ డి(రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌) విభాగాలలోకి బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement