సీజేపీ నిరసనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ఆదేశం | Supreme Court orders investigation CJP Student Protests | Sakshi
Sakshi News home page

సీజేపీ నిరసనలపై స్వతంత్ర దర్యాప్తు.. సుప్రీంకోర్టు ఆదేశం

Aug 18 2026 1:27 PM | Updated on Aug 18 2026 1:50 PM

  Supreme Court orders investigation CJP Student Protests

ఢిల్లీ: కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రిటైర్డ్ న్యాయమూర్తి, డీజీపీ నేతృత్వంలో ఉన్నత స్థాయి దర్యాప్తు జరగనుంది. 

మరోవైపు, కాక్రోచ్ జనతా పార్టీ  ఆందోళనలపై సుప్రీంకోర్టులో ఢిల్లీ పోలీసులు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ ఆందోళనలో 240 మందికి పైగా పోలీసులు గాయపడ్డారని అఫిడవిట్లో పేర్కొన్నారు. 5 వేల మంది భద్రత సిబ్బంది విధుల్లో ఉన్నారని వెల్లడించారు. నిరసనకారులపై అత్యంత నియంత్రణతో అవసరమైన బలగాలను మాత్రమే ఏర్పాటు చేసినట్టు  అఫిడవిట్లో ఢిల్లీ పోలీసులు చెప్పారు. NEET-UG CBSE పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జూన్ 6న జంతర్ మంతర్ వద్ద ఈ నిరసనలు తెలిపారని అఫిడవిట్ లో పేర్కొన్నారు పోలీసులు.

జూన్ 20న సాయంత్రం 5 గంటల వరకు ధర్నాకు అనుమతి ఇచ్చినప్పటికీ నిరసనకారులు ఖాళీ చేయలేదని  అఫిడవిట్ లో పేర్కొన్నారు. జులై 20న 'చలో సంసద్' మార్చ్ పిలుపుతో ఉద్రిక్తత పెరిగిందని, ఈ మార్చ్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిరసనకారులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఒక ప్రభుత్వ భవనాన్ని ధ్వంసం చేసి అక్కడి ఇటుకలతో దాడి చేశారని అఫిడవిట్‌లో తెలిపారు. 30,000 మందికి పైగా నిరసనకారులు ఆందోళలో పాల్గొన్నారన్నారు. నిరసనకారులపై అధిక బల ప్రయోగం చేయలేదని, పార్లమెంట్ మార్చ్ చట్ట విరుద్ధమని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement