
కృష్ణరాజపురం: మానసిక ఆందోళనతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఈ విషాద ఘటన గురువారం రాత్రి కర్నాటకలోని కృష్ణరాజపురం నగరంలోని బసవేశ్వర నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న టెక్కీ స్వాతి (26) ఇక్కడి గ్లోబల్ విలేజ్‌లో విధులు నిర్వహిస్తోంది. అయితే, రెండేళ్ల క్రితం ఐటీ ఉద్యోగి దామోదర్‌ను వివాహం చేసుకుంది. తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.