‘మొబైల్‌ సేవల లోపాలపై  ఫోరంను ఆశ్రయించొచ్చు’ 

SC Says Mobile Phone Users Can Approach Consumer Forum - Sakshi

న్యూఢిల్లీ: టెలికాం కంపెనీల మొబైల్‌ సేవల్లో లోపాలపై కస్టమర్లు వినియోగదారుల ఫోరాలను నేరుగా ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సమస్య పరిష్కారానికి టెలిగ్రాఫ్‌ చట్టంలో ఉన్న మధ్యవర్తిత్వ సదుపాయం దీనికి అడ్డు కాబోదని న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రంనాథ్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.

రెండింట్లో దేన్ని ఎంచుకోవాలన్నది కస్టమర్‌ ఇష్టమేనని చెప్పింది. ఉచిత సేవలు, కాంట్రాక్టులో భాగంగా కస్టమర్‌కు వ్యక్తిగతంగా అందించే సేవలు మాత్రమే ఇందుకు మినహాయింపు అని వివరించింది.

అహ్మదాబాద్‌కు చెందిన ఓ కస్టమర్‌ తమపై నేరుగా ఫోరాన్ని ఆశ్రయించడాన్ని సవాలు చేస్తూ వొడాఫోన్‌–ఐడియా సెల్యూలర్‌ కంపెనీ చేసుకున్న అపీలుపై విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top