ఒక్క ఉంగరంలోనే ఏకంగా 20 వేల వజ్రాలు... రికార్డు సృష్టించింది

తిరువనంతపురం: భారతదేశంలోని ప్రముఖ ఆభరణాల తయారీ కంపెనీలలో ఒకటైన ఎస్‌డబ్ల్యూఏ ఒక్క ఉంగరంలో ఒకటి రెండూ కాదు దాదాపు 24 వేల వజ్రాలతో ఒక ఉంగరాన్ని రూపొందించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో తయారైన ఈ ఉంగరం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తోపాటు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్సు వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుంది. ఈ ఉంగరానికి ది టచ్ ఆఫ్ అమీ' అని పేరు పెట్టారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుంచి లైఫ్‌స్టైల్ యాక్సెసరీ డిజైన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీమతి రిజిషా దీన్ని రూపొందించారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 24,679 వజ్రాలతో కేరళలో తయారైన ఉంగరం గిన్నిస్ రికార్డు సాధించింది. అత్యధిక వజ్రాలు సెట్ ఇన్ వన్ రింగ్ విభాగం పేరిట ఈ రికార్డును నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాల పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించే బెల్జియం వంటి దేశాలను వెనక్కి నెట్టి మరీ ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకోవడం నిజంగా గొప్ప విజయం అని ఎస్‌డబ్ల్యూఏ కంపెనీ యజమాన్యం చెబుతోంది.
(చదవండి: అనధికార భవనాలను కూల్చేయండి! కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు)
సంబంధిత వార్తలు