పాక్ ఆర్మీపై రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శలు | Rajnath Takes Swipe Pakistan Military Army Day Function In Lucknow, See Details Inside - Sakshi
Sakshi News home page

పాక్ ఆర్మీపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శలు

Jan 15 2024 9:04 PM | Updated on Jan 16 2024 11:46 AM

Rajnath Takes Swipe Pakistan Military Army Day function Lucknow - Sakshi

దేశ రాజ్యాంగ విలువల పట్ల భారత ఆర్మీ సైనికుల అకింతభావం సాటిలేదని కొనియాడారు. సైనికులు చూపించే గౌరవం దేశ ప్రజలంతా గుర్తించదగినది...

లక్నో: భారతదేశ మిలిటరీ సైనికులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, దేశ రక్షణకు కృషి చేస్తారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. పొరుగుదేశంలో ఇటువంటి పరిస్థితి లేదని పాకిస్తాన్‌ ఆర్మీపై పరోక్షంగా ఆయన విమర్శలు గు​ప్పించారు. 76వ ‘ఆర్మీ డే’ సందర్భంగా రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం లక్నోలో నిర్వహించిన ‘శౌర్య సంధ్య’ కార్యక్రమంలో మాట్లాడారు. 

మన పొరుగు దేశంలో మిలిటరీకి, దేశ రాజ్యాంగం విలువలకు అసలు సంబంధం ఉండదని తెలిపారు. సైనికులు కూడా దేశ రాజ్యాంగ విలువల పట్ల గౌరవం, అంకితభావం చూపారని పేర్కొన్నారు. కానీ, భారత దేశంలో మాత్రం అలా కాదన్నారు. దేశ రాజ్యాంగ విలువల పట్ల భారత ఆర్మీ సైనికుల అకింతభావం సాటిలేదని కొనియాడారు. సైనికులు చూపించే గౌరవం దేశ ప్రజలంతా గుర్తించదగినది పేర్కొన్నారు.

భారతీయ సైనికులు దేశం పట్ల ప్రత్యేకమైన ప్రేమతో మెలుగుతారని అన్నారు. సైనికులు దేశం పట్ల అంకితభావాన్ని సంస్కృతి విలువల మూలాల నుంచి అలవర్చుకున్నారని తెలిపారు. భారత రాజ్యాంగం పట్ల.. దేశభక్తి, ధైర్యం, మానవత్వం, విధేయత అనే నాలుగు ముఖ్యమైన లక్షణాలు ప్రతి భారత సైనికుడిలో కనిపిస్తాయని  చెప్పారు. ఏ సైనికుడు అయితే తన మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్కచేయడో అతనే నిజమైన దేశభక్తుడని అన్నారు. ఇటువంటి దేశభక్తి మాత్రమే ​ప్రతి సైనికుడిలో మరింత ధైర్యాన్ని నింపుతుందని తెలిపారు.

చదవండి: రాముని గుడి బయట గొడవ.. కాంగ్రెస్‌ జెండా చించివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement