గాయాలతో మొసలి.. 25 నిమిషాలు నిలిచిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌

Rajdhani Express Halted 25 Minutes Due To Crocodile On Rail Track - Sakshi

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

సహాయం చేసి పక్కకు తొలగించిన అగ్నివీర్‌ ప్రాణీణ్‌ ఫౌండేషన్‌

ముంబై: మొసలి పట్టాలపైకి రావడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటన వడోదర-ముంబై రైల్వే లైన్‌ మధ్య చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం రైలు పట్టాలపై గాయంతో బాధపడుతున్న మొసలి ప్రత్యక్షమైంది. దీంతో రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలు దాదాపు 25 నిమిషాల పాటు నిలిచిపోయింది. భద్రతా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి మొసలిని పక్కకు తీసిన అనంతరం రైళ్ల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మిగతా రైళ్లు దాదాపు 45 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి.
చదవండి: జాతీయ నిరుద్యోగ దినంగా ప్రధాని మోదీ జన్మదినం

కర్జన్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ సంఘటన జరిగింది. వన్యప్రాణుల కార్యకర్త హేమంత్‌ వద్వాన వచ్చి మొసలికి సపర్యలు చేసి పట్టాలపై నుంచి తొలగించాడు. ‘నాకు 3.15 నిమిషాలకు కర్జాన్‌ రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ పట్టాలపై మొసలి ఉందని ఫోన్‌ చేశారు. మొసలి వలన రైలు ఆగడం ఆశ్చర్యమేసింది. స్టేషన్‌ నుంచి మేం మొసలి ఉన్న దగ్గరకు వెళ్లడానికి ఐదు నిమిషాలు పట్టింది.’ అని హేమంత్‌ తెలిపారు. ‘మొసలి తీవ్ర గాయాలతో బాధపడుతోంది. ఆలస్యంగా వెళ్లి ఉంటే మొసలి చనిపోయి ఉండేది’ అని మరో వన్యప్రాణి కార్యకర్త నేహ పటేల్‌ వివరించారు.
చదవండి: చిన్నారి కేసులో కీలక మలుపు.. పోలీసుల అదుపులో రాజు స్నేహితుడు

‘పట్టాలపై నుంచి మొసలిని తొలగించిన అనంతరం కిసాన్‌ రైలులో తరలించాం. అనంతరం అటవీ శాఖ అధికారులకు మొసలిని అప్పగించాం’ అని కర్జాన్‌ రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ సంతోశ్‌ శర్మ తెలిపారు. వన్యప్రాణి కార్యకర్తలంతా అగ్నివీర్‌ ప్రాణీణ్‌ ఫౌండేషన్‌ సభ్యులు. వారు ఇలా వన్యప్రాణులు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే వాటిని ఈ ఫౌండేషన్‌ సభ్యులు కాపాడుతారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top