‘దేశాన్ని కాపాడేందుకు లాఠీ దెబ్బలూ భరిస్తాం’

Rahul Gandhi Says Our Job Is To Protect Country - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర్‌ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో హత్యాచారానికి గురైన దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన క్రమంలో తన పట‍్ల యూపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి స్పందించారు. తనను పోలీసులు తోసివేయడం పెద్ద విషయం కాదని, దేశాన్ని కాపాడటమే తమ బాధ్యతని రాహుల్‌ వ్యాఖ్యానించారు. వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్‌లో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొన్నారు. తాము రైతులు పక్షాన పోరాడతామని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరుమెదిపితే తమను తోసివేస్తున్నారని, ప్రజల కోసం తాము లాఠీ దెబ్బలనూ భరిస్తామని స్పష్టం చేశారు. చదవండి : రైతులకు అన్యాయం జరగనివ్వం

హత్రాస్‌లో జరిగిన దుర్మార్గం కూతుళ్లు ఉన్న వారందరూ అర్ధం చేసుకున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. మీకు కూతురు లేకపోతే హత్రాస్‌ కేసులో హత్య కోణం ఒక్కటే మీరు అర్ధం చేసుకోగలరని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని జిల్లా మేజిస్ట్రేట్‌ను బెదిరించారని ఆ సమయంలో వారు ఒంటరి కాదని భరోసా ఇచ్చేందుకే తాను అక్కడికి వెళ్లానని రాహుల్‌ చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలందరికీ తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు. హత్రాస్‌లో బాధితురాలి కుటుంబాన్ని జిల్లా మేజిస్ట్రేట్‌ బెదిరించారనే ఆరోపణలను రాహుల్‌ ప్రస్తావించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top