మళ్లీ విజృంభిస్తున్న కరోనా!... 79 కొత్త కోవిడ్‌ కేసులు

Pune District Reported 79 New Covid 19 Cases And No Deaths - Sakshi

పుణె: మహారాష్టలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పుణెలో 79 కొత్త కరోనా కేసుల నమోదయ్యాయని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయితే ఎటువంటి మరణాలు సంభవించ లేదని తెలిపింది. అసలు ఇప్పటి వరకు పుణెలో సుమారు 1.45 మిలియన్ల మంది కరోనా సోకింది. అందులో దాదాపు 1.43 మిలియన్ల మంది కోలుకోగా..20,509 మరణాలు నమోదయ్యాయి.

ఈ మేరకు కొత్త కరోనాకి సంబంధించి పుణె రూరల్‌లో 54, పూణె నగరంలో 23, పింప్రి-చించ్వాడ్‌లో 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కొత్త కరోనాకి సంబంధించిన కేసుల సంఖ్య 425,256కి చేరుకుంది. అయితే పుణె రూరల్‌లో మరణాల సంఖ్య 7,143 , పుణె నగరంలో 9,427 మరణాలు నమోదయ్యాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో సుమారు 17.46 మిలయన్‌ డోస్‌ల వ్యాకిన్లు వేశారు. అందులో 9.52 మిలియన్లు మొదటి డోస్‌లు, 7.68 మిలియన్లు రెండవ డోస్‌లు, 2,48,055 మందికి ముందు జాగ్రత్త డోస్‌లు వేశారు.

(చదవండి: Corona Virus: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక ప్రకటన)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top