12 రోజుల్లోనే 5.4 సె.మీ కుంగిపోయిన జోషిమఠ్.. వాళ్లకు ఆర్థిక సాయం

Property Owners Joshimath Will Get Rs 5000 Rental Purposes - Sakshi

డెహ్రాడూన్‌: దేవభూమిగా పేరున్న ఉత్తరాఖండ్ జోషిమఠ్ రోజుకు రోజుకు కుంగిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వం చాలా కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ప్రమాదకరంగా మారిన ఇళ్లు, భవనాలను కూల్చివేసింది. అయితే జోషిమఠ్ నిర్వాసితులకు సాయం విషయంపై ఉత్తరాఖండ్ కేబినెట్ శుక్రవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

జోషిమఠ్‌లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అద్దె సాయంగా రూ.5వేలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే 6 నెలల పాటు విద్యుత్ బిల్లులకు రాయితీ ఇవ్వనుంది. నవంబర్ 2022 నుంచి ఇది వర్తిస్తుంది. ఇళ్లు ఖాళీ చేసి హోటళ్లు, రిసార్టుల్లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న వారికి గదికి రూ.950 చొప్పున చెల్లించనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఉంటున్న వారికి ఒక్కొక్కరికి రూ.450 ఇవ్వనుంది.

ఇస్రో ఫొటోలు..
జోషిమఠ్ గత 12 రోజుల్లోనే 5.4 సెంటిమీటర్లు కుంగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ఛాయాగ్రహ చిత్రాలను విడుదల చేసింది. ఇక్కడి పరిస్థితిపై కేంద్ర హొంమంత్రి అమిష్ షా గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజలకు అన్ని విధాలుగా సాయం  అందించాలని అధికారులకు సూచించారు.

జోషిమఠ్‌లో ఇప్పటివరకు 169 కుటుంబాలకు చెందిన 589 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. పగుళ్ల వల్ల తీవ్రంగా ప్రభావితమైన 42 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5లక్షలు తాత్కాలిక సాయంగా అందించింది.
చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top