పోక్సో చట్టం కింద అరెస్ట్‌ , బెయిల్‌ ఇచ్చిన కోర్టు!

Promise to Marry Minor Victim, Man Got Bail Charged Under Pocso Act - Sakshi

చెన్నై: పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసిన ఒక వ్యక్తికి మద్రాస్‌ కోర్టుకు చెందిన మధురై బెంచ్‌ బెయిల్‌ మంజూరు చేసింది. 17 ఏళ్ల బాధితురాలిని తనకు చట్టప్రకారం పెళ్లి వయసు వచ్చిన తరువాత వివాహం చేసుకుంటానని ఒప్పుకోవడంతో కోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేసింది. ఒక మైనర్‌ బాలికను లైంగికంగా వేధించాడనే కారణంగా అతనిపై పోక్సో చట్టంలోని వివిధ సెకక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.  బాధితురాలిని అక్టోబర్‌ 10, 2021 నాటికి వివాహం చేసుకోవాలని కోర్టు ఆ వ్యక్తిని ఆదేశించింది.

పెళ్లి అనంతరం ఆ రిజిస్ట్రేషన​ పత్రాలను తీసుకువచ్చి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో అందించాలని, అలా చేయని పక్షంలో పోలీసులు ఏక్షణమైన అరెస్ట్‌ చేయవచ్చని పేర్కొంది. భాదితులరాలు, నిందితుడు ప్రేమించుకుంటున్నారని, ఇష్టంతో వారిద్దరు దగ్గరయ్యారని కోర్టుకు తెలిపారు. ఆ కారణంగానే ఆమె గర్భవతి అయ్యిందని కోర్టుకు తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యం నిందితుడికి ఉందని చట్టం ప్రకారం 18 ఏళ్లు దాటిన తరువాత ఆమెను వివాహం చేసుకుంటాడని కోర్డు విచారణలో భాగంగా తెలిపారు. నిందితుడు 50 రోజులకు పైగా జైలులో ఉన్నాడని, అతనికి బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. వాదనలు విన్న కోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేసింది.

చదవండి: మహిళ ఆత్మహత్య; అత్తారింటిపై 5 పేజీల లేఖ

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top