చూపులతో ప్రేమగా పలకరిస్తాయి.. పెద్ద తేడా ఏముంది?

Prem Shankar, Kishore Iyer, Celebrities Social Media Comments - Sakshi

సోషల్‌ నెట్‌ వర్కింగ్‌ వెబ్‌సైట్లు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! 

తర్వాతి స్టెప్‌
ఏఐడీయెంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం శశికళ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు కొట్టేశాక.. ‘మీ తర్వాతి స్టెప్‌ ఏమిటి?’ అని ఒక రిపోర్టర్‌ అడిగిన ప్రశ్నకు ఆమె తన కారు అద్దాన్ని ఒకసారి కిందికి దించి, తిరిగి పైకి లాగేశారు. దీనర్థం ఏమిటి? హిందీలో ఒక నానుడి ఉంది. సంజ్ఞతో అర్థం చేసుకోగలిగిన వారికి నోటితో చెప్పాల్సిన పనేముంది?
– వి. ప్రేమ్‌ శంకర్, జర్నలిస్ట్‌

చేతుల్లోకి తీసుకోండి
డ్యూటీకి వెళ్లి వస్తున్నప్పుడు ఓ స్ట్రీట్‌ డాగ్‌ రోజూ నన్ను అనుసరి స్తుంటుంది. నాపై అలవిమాలిన ప్రేమను కురిపిస్తుంటుంది. నేషనల్‌ పెట్స్‌ డే కనుక ఆ మూగ ప్రాణిని ఆగి, నా చేతుల్లోకి తీసుకున్నా. నేరుగా ఇంటికి తెచ్చేసు కున్నా. వాటికి మాటలు రాకపోవచ్చు. చూపులతోనే ప్రేమగా పలకరిస్తాయి. పెట్స్‌కి మన ప్రేమను కూడా పంచుదాం.
– సుదీందర్‌జీత్‌ కౌర్, ఏసీపీ, ఢిల్లీ

ఎప్పటికీ విశ్వసించలేను
ఎంచేతో, ఇండియాలోని రోప్‌వేలను నేను ఎప్పటికీ విశ్వసించలేను. ధీమాగా వాటి కేబుల్‌ కార్‌లలో ప్రయాణించలేను. జార్ఘండ్‌లో ఇవాళ జరిగిన రోప్‌వే ప్రమాదం... గతంలో జరిగిన డార్జిలింగ్‌ రోప్‌ వే ఘటనను నాకు స్ఫురణకు తెచ్చింది. అప్పట్లో కనీసం నలుగురు పర్యాటకులు దర్మరణం చెందారు.
– అర్పిత, నేచర్‌ లవర్‌

రెండూ వేర్వేరు కావు
స్త్రీని కొట్టేందుకు చెయ్యెత్తే మగాడు జంతువు, మృగం మాత్రమే కాదు... క్లాస్‌ రూమ్‌లో అతడెప్పుడూ చెయ్యెత్తిన వాడై ఉండడు. మహిళలూ... హింసాపూరిత ఆత్మీయతలకు దూరంగా ఉండండి. మీ దేహంపై చెయ్యి పడటమూ, మీ ఆత్మగౌరవం దెబ్బతినడమూ రెండూ వేర్వేరు కావు.
– మాక్సిమిలియానో, ఇన్‌ఫ్లుయెన్సర్‌

ఎక్కడి నుంచి వచ్చాయి!
శ్రీరామ నవమి రోజు దేశంలోని పలు ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య జరిగిన అల్లర్ల గురించి చెబుతూ ఎన్డీటీవీ యాంకర్లు... ‘ముస్లిం ఏరియాస్‌’ అనే మాటను ప్రయోగించారు! నాకు గుర్తున్నంతవరకు ఇండియా లౌకిక రాజ్యం అనే మన రాజ్యాంగం చెప్పింది. మరి ముస్లిం ఏరియాస్‌ ఎక్కడి నుంచి వచ్చాయి?                       
– కిశోర్‌ అయ్యర్, సెక్యులరిస్ట్‌

ఇంతా చేసి అంతేనా!!
షెబాజ్‌ షరీఫ్‌ ఈరోజు 174 ఓట్లు సాధించి పాకిస్థాన్‌కు 23వ ప్రధాని అయ్యారు. 2018లో ఇమ్రాన్‌ ఖాన్‌ 176 ఓట్లు గెలిచి ప్రధాని అయ్యారు. పెద్ద తేడా ఏముంది?
– హమిద్‌ మిర్, పాక్‌ ‘నిషిద్ధ’ జర్నలిస్ట్‌

నిస్సిగ్గు ఎంపిక
బెయిల్‌ పై బయట తిరుగుతున్న ఒక నేరస్థుడిని 174 మంది దుండగుల సమూహం పాక్‌ 23వ ప్రధానిగా నిస్సిగ్గుగా ఎన్నుకుంది. విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గిన వారు ధీశాలి అయిన ఇమ్రాన్‌ వైపు చూడండి. ఇమ్రాన్‌... అల్లా మిమ్మల్ని రక్షించుగాక!              
– ఖదిమి, సోషల్‌ యాక్టివిస్ట్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top