ప్రీవెడ్డింగ్‌ షూట్‌లో చిన్నారి పెళ్లికూతురు | Pre wedding photoshoot exposes fraud | Sakshi
Sakshi News home page

ప్రీవెడ్డింగ్‌ షూట్‌లో చిన్నారి పెళ్లికూతురు

Jun 21 2026 9:02 PM | Updated on Jun 21 2026 9:05 PM

Pre wedding photoshoot exposes fraud

బీడ్: సామాజిక మాధ్యమాల్లో పెళ్లికి ముందు ఫొటోషూట్లు, రీల్స్‌ అప్‌లోడ్ చేసే ధోరణి పెరిగిపోయింది. ఈ ధోరణే ఓ బాల్య వివాహాన్ని ఆపింది. 15 ఏళ్ల బాలికను కాపాడింది. పెళ్లికి ముందు చేసిన ఫొటోషూట్‌ ఓ బాల్య వివాహాన్ని అడ్డుకుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన చిత్రాలు అధికారుల దృష్టికి చేరడంతో వెంటనే చర్యలు చేపట్టారు. 15 ఏళ్ల బాలికను రక్షించి, పెళ్లిని నిలిపివేశారు. 

ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో చోటుచేసుకుంది. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్ చిత్రాలపై జిల్లా కలెక్టర్ వివేక్ జాన్సన్‌కు సమాచారం అందింది. జియోరాయ్ తాలూకాలో 15 ఏళ్ల బాలికకు 23 ఏళ్ల యువకుడితో జరగాల్సిన పెళ్లిని కలెక్టర్‌ జోక్యంతో నిలిపేశారు. వారి పెళ్లిని జూన్ 19న నిలిపివేశారని బాలల సంక్షేమ కమిటీ ఛైర్‌పర్సన్ అశోక్ టాంగడే తెలిపారు.

‘బాలిక చేతులపై మెహందీ’తో కనిపెట్టి..
అశోక్ టాంగడే తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా మహిళా, శిశు అభివృద్ధి శాఖ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారుల బృందం వెంటనే గ్రామానికి చేరుకుంది. అక్కడ పెళ్లి జరుగుతున్నట్టు బయటకు కనిపించే ఆనవాళ్లు ఏవీ లేకపోయినా, బాలిక చేతులపై వరుడి పేరు ఉన్న పెళ్లి మెహందీ కనిపించింది. 

పెళ్లికి ముందు ఫొటోషూట్ చిత్రాలను పరిగణనలోకి తీసుకున్న బృందం బాలికను రక్షణ కస్టడీలోకి తీసుకుందని, దర్యాప్తు కొనసాగుతోందని అశోక్‌ టాంగడే తెలిపారు. బాల్య వివాహం విషయంలో సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement