ప్రచారం ముగిశాక కన్యాకుమారికి ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

ప్రచారం ముగిశాక కన్యాకుమారిలో ప్రధాని ధ్యానం

Published Tue, May 28 2024 4:50 PM

Pm Modi Will Go To Kanyakumari After Election Campaign Ends

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే ప్రధాని మోదీ తమిళనాడులోని కన్యాకుమారి వెళ్లనున్నారు. జూన్‌ 1న జరగనున్న ఏడవ, తుది విడత ఎన్నికల ప్రచారానికి మే 30వ తేదీ సాయంత్రంతో గడువు ముగుస్తుంది.

ప్రచారం ముగించుకుని 30న ప్రధాని కన్యాకుమారి చేరుకుంటారు. జూన్‌ 1 వరకు 3 రోజుల పాటు ఆయన కన్యాకుమారిలోనే ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా సముద్రం ఒడ్డున​ ఉన్న వివేకానంద రాక్‌ మెమోరియల్‌ వద్ద ప్రధాని ధ్యానం చేయనున్నారు. ఇదే స్థలంలో స్వామి వివేకానంద ఒకప్పుడు మూడు రోజులపాటు ధ్యానం చేశారు.

ఈ పర్యటనలో ప్రధాని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకే సమయం కేటాయించనున్నారు. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనరు. 2019లోనూప్రధాని ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత  కేదార్‌నాథ్‌కు ధ్యానం చేసేందుకు వెళ్లారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement