ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ | PM Modi, Trump discuss Strait of Hormuz crisis in first call since West Asia war | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌

Mar 24 2026 6:32 PM | Updated on Mar 24 2026 7:04 PM

 PM Modi, Trump discuss Strait of Hormuz crisis in first call since West Asia war

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫోన్‌ చేశారు. పశ్చిమాసియాలో పరిస్థితులపై మోదీ, ట్రంప్‌ చర్చించారు. హార్మూజ్‌ జలసంధిని తెరిపించాల్సిన అవసరంపై మాట్లాడుకున్నారు. భారత్‌లో అమెరికా రాయబారి సెర్జియో గోర్ మంగళవారం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఈ వివరాలు తెలిపారు.

కాగా, అలీ లారిజానీ మృతితో కొత్త సెక్యూరిటీ చీఫ్‌ను నియమించింది ఇరాన్‌. మొహమ్మద్ బాఘర్ జోల్ఘద్ర్ ను సుప్రీమ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కొత్త కార్యదర్శిగా నియమించింది. దేశ భద్రతా విధానాలను నిర్ణయించే అత్యున్నత సంస్థే ఈ ‘కౌన్సిల్’. 

డొనాల్డ్‌ ట్రంప్‌ ఐదు రోజులపాటు యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రకటన చేసినప్పటికీ ఇరాన్‌ దాడులు ఆపడం లేదు. ఇరాన్ నుంచి వచ్చిన 5 బాలిస్టిక్ క్షిపణులను, 17 డ్రోన్లను అడ్డుకున్నామని యూఏఈ ఇవాళ ప్రకటించింది. 

ఇరాన్ యుద్ధం కారణంగా ఫిలిప్పీన్స్ ‘జాతీయ శక్తి అత్యవసర పరిస్థితి’ని ప్రకటించింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ ప్రకటన చేశారు. దేశీయ ఇంధన సరఫరాలు, ఎనర్జీ స‍్టెబిలిటీపై ఇరాన్ యుద్ధం వల్ల పడ్డ ప్రభావాన్ని ఆయన గుర్తు చేశారు.

“పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణ నేపథ్యంలో, దేశ ఎనర్జీ సరఫరా లభ్యత, స్థిరత్వానికి ప్రమాదం ఉండడంతో జాతీయ శక్తి అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తున్నాం,” అని ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులో తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement