
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గాజా శాంతి ప్రణాళిక ప్రారంభ దశను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. శాశ్వత శాంతిపై ఆశాభావం వ్యక్తం చేశారు. సుదీర్ఘ సంఘర్షణల తర్వాత కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని ప్రశంసించారు. దీనిలో బందీలను విడుదల చేయడం, మానవతా సహాయాన్ని పెంచడం అనేవి కీలకమైన దశలని ప్రదాని మోదీ పేర్కొన్నారు. ఈ పురోగతిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నాయకత్వాన్ని కూడా ప్రధాని మెచ్చుకున్నారు.
We welcome the agreement on the first phase of President Trump's peace plan. This is also a reflection of the strong leadership of PM Netanyahu.
We hope the release of hostages and enhanced humanitarian assistance to the people of Gaza will bring respite to them and pave the way…— Narendra Modi (@narendramodi) October 9, 2025
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి ప్రణాళిక మొదటి దశపై ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతిస్తూ, దీనివెనుక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వం ఉందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘ఎక్స్’లో ఇలా రాశారు ‘అధ్యక్షుడు ట్రంప్ శాంతి ప్రణాళిక మొదటి దశపై ఒప్పందాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇది ప్రధాని నెతన్యాహు బలమైన నాయకత్వానికి ప్రతిబింబం. బందీల విడుదల, గాజా ప్రజలకు మెరుగైన మానవతా సహాయం లాంటివి బాధితులకు ఉపశమనాన్ని కలిగిస్తాయని, శాశ్వత శాంతికి మార్గం సుగమం అవుతుందని ఆశిస్తున్నాం’ అని అన్నారు.
దీనికిమందు ‘ట్రూత్ సోషల్’లో ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందాన్ని ట్రంప్ ప్రకటించారు. దీనిని బలమైన, శాశ్వత శాంతి వైపు మొదటి అడుగుగా అభివర్ణించారు. ‘ఇజ్రాయెల్- హమాస్ రెండూ మేము రూపొందించిన శాంతి ప్రణాళిక మొదటి దశపై సంతకం చేశాయని ప్రకటించడానికి చాలా సంతోషపడుతున్నాను. ఈ ఒప్పందం ప్రకారం బందీలు అతి త్వరలో విడుదలవుతారు. ఇజ్రాయెల్ దళాలు సైనిక చర్యలను ఉపసంహరించుకుంటాయి. ఇరువర్గాలు న్యాయబద్ధంగా వ్యవహరిస్తాయి. ఇది అరబ్, ముస్లిం దేశాలు, ఇజ్రాయెల్ ఆ చుట్టుపక్కలగల అన్ని దేశాలు , యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సుదినం. ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదరడానికి మాతో కలిసి పనిచేసిన ఖతార్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. శాంతిదూతలు ధన్యులు’ అని ట్రంప్ పేర్కొన్నారు.