ధాన్యం సేకరణపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

Piyush Goyal Takes On CM KCR For Paddy Procurement - Sakshi

ఢిల్లీ: ధాన్యం సేకరణ అంశంపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం పారా బాయిల్డ్‌ ఇవ్వమని రాతపూర్వకంగా ఇచ్చిందని, ఎంవోయూ ప్రకారమే ముడి బియ్యం ఇస్తామని రాసిచ్చారని పీయూష్‌ గోయల్‌ ఆరోపించారు.  శుక్రవారం రాజ్య‌స‌భ సమావేశాల్లో భాగంగా  ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో  ధాన్యం సేకరణపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

ఈ మేరకు పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ.. ఇప్పుడు కొత్తగా వడ్ల సేకరణ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని,  ధాన్యం సేకరణ అంశానికి సంబంధించి సీఎం ద్వారా దమ్కీలు ఇస్తున్నారని తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. పంజాబ్‌ తరహాలో కొనాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ లేఖ రాశారని,పంజాబ్‌లో పండే బియ్యాన్ని దేశమంతటా తింటారని ఈ సందర్భంగా పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు.. మరి అటువంటి బియ్యాన్ని ఇవ్వాలని కోరామని అన్నారు పీయూష్‌ గోయల్‌. రైతులను తప్పుదోవ పట్టించేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, తెలంగాణలో పండే రా రైస్‌ మొత్తం తీసుకుంటామన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top