లోకల్‌ రైళ్లల్లో పిల్లలకు నిషేధం 

Only Women, No Children Allowed In Mumbai Local Trains - Sakshi

సాక్షి, ముంబై: లోకల్‌ రైళ్లల్లో చిన్న పిల్లలతో కలసి ప్రయాణం చేయడంపై రైల్వే నిషేధం విధించింది. అత్యవసర విధులు నిర్వహించే వారి కోసం ప్రారంభించిన లోకల్‌ రైళ్లలో, ప్రస్తుతం పలు విభాగాలకు చెందిన ప్రయాణికులందరినీ ప్రయాణం చేసేందుకు అనుమతించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు లోకల్‌ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతించింది. ఈ క్రమంలో చాలా మంది మహిళలు తమ పిల్లలతో కలసి లోకల్‌ రైళ్లలో ప్రయాణిస్తుండటం కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిలో చిన్న పిల్లలతో లోకల్‌ ప్రయాణం ప్రమాదకరమని, పిల్లలతో కలసి లోకల్‌ రైళ్లలో ప్రయాణించే మహిళలను రైళ్లల్లో అనుమతించబోమని రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో మహిళలు మాత్రమే లోకల్‌ రైళ్లల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకోనుంది. దీనికోసం ఇకపై ముంబైలోని రైల్వే స్టేషన్‌లో గేట్ల వద్ద ఆర్‌పీఎఫ్‌ జవాన్లను మోహరించనుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top