24 గంటల్లో ఈ ప్రాంతాల్లో నమోదు కానీ కోవిడ్‌ మరణాలు

No Covid Deaths In Last 24 hours In 15 States And Union Territories - Sakshi

ఈ  ప్రాంతాల్లో గత 24 గంటల్లో ఒక్క కోవిడ్‌ మరణం కూడా నమోదు కాలేదు.

ఇది నిజంగా శుభవార్త: కేంద్రం

సాక్షి, న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్‌-19 మరణం కూడా నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ బలహీనపడుతోందని, దీనికి ఇదే నిదర్శనం అని పేర్కొంది. అలాగే సగటున రోజు నమోదయ్యే కరోనా మరణాల రేటు గత అయిదు వారాలుగా 55 శాతానికి పడిపోయిందని తెలిపింది. గత వారంలో అరుణాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, దాద్రా నగర్‌హావేలీ, అండమాన్‌ అండ్‌ నికోబార్‌, నాగాలాండ్‌, మిజోరం, లక్షద్వీప్‌లలో వంటి ప్రాంతాల్లో ఒక్క కోవిడ్‌ మరణం కూడా నమోదు కాలేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈ సందర్భంగా నీతి ఆయోగ్‌ సభ్యులు వికే పాల్‌ ట్వీట్‌ చేస్తూ.. ప్రపంచలోనే ఒక మిలియన్ జనాభాకు రోజువారి కరోనా మరణాల గణాంకాలు గడిచిన వారం రోజుల్లో భారతదేశంలో అత్యల్పంగా ఉన్నాయని ఆయన తెలిపారు. ‘రోజురోజుకు దేశంలో కోవిడ్‌ మరణాలు సంఖ్య తగ్గుతోంది. ఇది నిజంగా శుభవార్త. గత 24 గంటల్లో న్యూఢిల్లీలో ఎటువంటి కోవిడ్‌ మరణాలు నమోదు కాలేదు ఇది కూడా శుభవార్త. అయితే కరోనాకు ముందస్తు జాగ్రత్తుల పాటించడం తప్పనిసరి. సెరో సర్వే ప్రకారం మన దేశ జనాభాలో 70 శాతం మంది ఇప్పటికీ కరోనా పాజిటీవ్‌తో బాధపడుతున్నారు’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top