
నాగపూర్: ఇటీవలి కాలంలో బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాగపూర్‌లో ఉన్న నితిన్ గడ్కరీ నివాసంలో బాంబు పెట్టినట్లు ఓ వ్యక్తి.. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో, అప్రమత్తమైన పోలీసులు, బాంబ్‌స్క్వాడ్.. గడ్కరీ ఇంట్లో గాలింపు చర్యలు చేపట్టారు. సోదాల తర్వాత ఎటువంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అది నకిలీ బెదిరింపు అని తేల్చారు. అనంతరం ఫోన్ నంబర్ ఆధారంగా గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నకిలీ బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని నాగ్‌పుర్ తులసి బాగ్ రోడ్‌లోని మద్యం దుకాణంలో పనిచేసే ఉమేష్ విష్ణు రౌత్‌గా గుర్తించామన్నారు. బెదిరింపు కాల్ చేయడానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
#WATCH | Nagpur, Maharashtra: Nagpur Police arrested a man for allegedly threatening to bomb Union Minister Nitin Gadkari’s residence.
On this, DCP Nagpur, Rushikesh Singa Reddy says, "We received a call in which someone claimed they had planted a bomb in Nitin Gadkari's home,… pic.twitter.com/flrZc3k2LQ— ANI (@ANI) August 3, 2025