Delhi Horror: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి?

Nidhi Blaming Anjali What Kind Of A Friend She Is Dcw Chief - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయ తెలిసిందే. స్కూటీపై వెళ్తున్న అంజలిని మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢొకొట్టి ఈడ్చుకెళ్లారు. అయితే ఈ సమయంలో  ఆమె స్నేహితురాలు నిధి అక్కడే ఉన్నారు. అంజలి కారు కింద నలిగిపోవడం చూసి కూడా ఆమె సాయం చేసేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అక్కడి నుంచి పారిపోయింది. పైగా అంజలిదే తప్పు అని మాట్లాడింది.

నిధి తీరుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ మండిపడ్డారు. చనిపోయిన ఫ్రెండ్‌ గురించి ఇలా మాట్లాడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ కళ్ల ముందే అంజలి కారు కింద పడి నలిగిపోతుంటే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి అని ఫైర్ అయ్యారు. విపత్కర పరిస్థితిలో స్నేహితురాలిని విడిచిపెట్టి వెళ్లిన నీ లాంటి వాళ్లను ఎలా నమ్మాలి అని వ్యాఖ్యానించారు. ఈమేరకు ఓ వీడియో విడుదల చేశారు.

జనవరి 1న అంజలి, నిధి స్కూటీపై వెళ్తుండగా కారు ఢీకొట్టింది.  కారు చక్రాల కింద అంజలి ఇరుక్కుంది. తాగిన మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఈ విషయాన్ని గమనించకుండా కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. కంఝవాల ప్రాంతంలో ఉదయం అంజలి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో నిధికి ఎలాంటి గాయాలు కాలేదు.
చదవండి: ఢిల్లీలో మరో షాకింగ్ ఘటన.. యువతిని బలవంతంగా కారులోకి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top