Chandrayaan -3: ఇదంతా నెహ్రూ ఘనతే: చత్తీస్‌గఢ్ సీఎం | This Is Nehrus Vision: Chhattisgarh CM Bhupesh Bhagel Credits Nehru For Chandrayaan 3 - Sakshi
Sakshi News home page

Chandrayaan -3: నెహ్రూ చొరవతోనే ఇది సాధ్యమైంది: చత్తీస్‌గఢ్ సీఎం

Aug 23 2023 9:44 AM | Updated on Aug 23 2023 11:42 AM

Nehrus Vision Chhattisgarh CM Credits Nehru For Chandrayaan 3 - Sakshi

రాయ్‌పూర్: మరికొద్ది గంటల్లో చంద్రయాన్-3 చంద్రుడిపై కాలుమోపనున్న నేపధ్యంలో చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ భగేల్ చంద్రయాన్-3 చారిత్రాత్మక విజయమని ఈ ఘనత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూదేనని వ్యాఖ్యానించారు.  

భారతదేశం చంద్రయాన్-3 విజయవంతమవుతున్న వేళ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించిన చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్  ఇది గొప్ప విజయమని చెబుతూ ఈ ఘనత మొత్తం భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకే దక్కుతుందని అన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 1962లో నెహ్రూ హయాంలోనే స్థాపించబడిందని అప్పట్లో దీనిని ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్(INCOSPAR)గా పిలిచేవారని అన్నారు. ఆయన ముందుచూపుతో వ్యవహరించబట్టే ఈరోజు ఈ ఘనత సాధ్యమైందని అన్నారు.        

మరికొద్ది గంటల్లో యావత్ భారతదేశం గర్వించదగ్గ క్షణాలు ఆవిష్కృతం కానున్నాయి. చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించి  చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొట్టమొదటి దేశంగా భారతదేశం చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోనుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే చంద్రుడిని చేరుకోగా భారతదేశం ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా నిలవనుంది. 

ఇది కూడా చదవండి: చందమామను ముద్దాడే క్షణం కోసం.. చంద్రయాన్‌–3 ప్రయోగంలో కీలక ఘట్టం నేడే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement