బ్రేకింగ్‌: రూ. 3 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత

Navy Recovers 300 kg Narcotics Worth 3000 Crore From Fishing Vessel - Sakshi

అరేబియా సముద్రంలో 300 కిలోల డ్రగ్స్‌ స్వాధీనం

న్యూఢిల్లీ: భారత నావికా దళం సుమారు 3,000 కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. అరేబియా సముద్రంలో చేపలు పట్టే ఓ నౌక నుంచి 300 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇండియన్‌ నేవి న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐకి వెల్లడించింది. వీటి విలువ సుమారు మూడు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తోన్న ఐఎన్‌ఎస్‌ సువర్ణ ఈ డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది.

అరేబియా సముద్రంలో పెట్రోలింగ్‌ విధులు నిర్వహిస్తున్న ఐఎన్‌ఎస్‌ సువర్ణ.. చేపలు పట్టే నౌక ఒకటి సముద్రంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండటాన్ని గమనించింది. వెంటనే రంగంలోకి దిగి.. సదరు నౌక సిబ్బందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడమే కాక నౌకలో సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో షిప్‌లో 300 కేజీలకు పైగా డ్రగ్స్‌ ఉండటం గమనించింది. వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవడమే కాక.. విచారణ నిమిత్తం నౌక, దానిలో ఉన్న సిబ్బందిని కేరళ కొచ్చి తీరానికి తరలించింది. ఈ నౌక ఎవరికి సంబంధించింది.. దీనిలో రవాణ చేస్తున్న డ్రగ్స్‌ ఎవరికి సంబంధించినవి తదితర వివరాలను రాబట్టనుంది. 

చదవండి: సంచలనం: బెంగళూరు డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ ప్రముఖులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top