సీఎం యోగి కీలక నిర‍్ణయం.. అక్కడ జాతీయ గీతం తప్పనిసరి

National Anthem Mandatory In Madrasas At Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. సీఎంగా యోగి ఆదిత్యానాథ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీలోని మదర్సాలలో జాతీయ గీతం ఆలపించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత‍్తర్వులు గురువారం జారీ చేసింది. 

ఉత్తరప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ కౌన్సిల్ మదర్సాలలో ప్రతీరోజు తరగతులు ప్రారంభించడానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ యోగి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు బీజేపీ అధికార ప్రతినిధి రాకేశ్‌ త్రిపాఠి తెలిపారు. జాతీయ గీతం ఆలపించడం మదర్సా విద్యార్థులందరిలో జాతీయతా భావాన్ని పెంపొందిచేలా చేస్తుందని అన్నారు. 

ఇది కూడా చదవండి: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top