అత్తింటివారి దాష్టీకం!...బాలింత అయిన కోడలిని ఇంట్లోకి రానివ్వకుండా...

Mother In Law Does Not Allow Daughter In Law To Enter The House - Sakshi

యశవంతపుర: భర్త మృతి చెందిన దుఃఖంలో ఉన్న కోడలికి అండగా ఉండాల్సిన అత్తింటివారు నిర్దయగా వ్యవహరించి ఆమెను ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. 30 రోజుల బాలింత అయిన ఆమె తన చిన్నారితో కలిసి ఓ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతోంది. ఈ ఘటన ఉడిపిలో జరిగింది. బాదామికి చెందిన అయ్యప్ప(28) ఉడిపిలో మెకానిక్‌ పని చేసేవాడు.

రెండేళ్ల క్రితం గంగావతికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరి వివాహానికి ఇరువైపులా పెద్దలు అంగీకరించలేదు. దీంతో అయ్యప్ప పెద్దలను ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు.  నెల రోజుల క్రితం ఈ దంపతులకు ఆడబిడ్డ పుట్టింది. అయితే ఆ కుటుంబంపై విధి కన్నెర్ర చేసింది.

20 రోజుల క్రితం అయ్యప్ప కింద పడగా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు  నిర్ధారించారు. అయితే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లిన తల్లిదండ్రులు కోడలిని మాత్రం ఇంట్లోకి అడుగు పెట్టనివ్వలేదు. దిక్కుతోచని స్థితిలో ఆమె తన చిన్నారితో కలిసి ఉడిపి సమాజ సేవక విశుశెట్టి అంబలపాడి నిట్టూరు సఖి ఆశ్రయంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతోంది. 

(చదవండి: చైన్‌స్నాచింగ్‌ చేయకపోతే నిద్రపట్టదు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top