కన్న కూతురినే కడతేర్చిన తల్లి… ఆపై ఆత్మహత్య | Mother And Daughter Incident | Sakshi
Sakshi News home page

కన్న కూతురినే కడతేర్చిన తల్లి… ఆపై ఆత్మహత్య

Apr 15 2026 10:45 AM | Updated on Apr 15 2026 10:45 AM

Mother And Daughter Incident

బెంగళూరు: ఏం కష్టం వచ్చిందో గానీ కూతురిని చంపి, ఆపై తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఎంత ఆపద వచ్చినా పిల్లలను కాపాడుకోవాల్సిన అమ్మ గుండె రాతిగా మారింది. ఈ దుర్ఘటన సిలికాన్‌ సిటీలో వైట్‌ఫీల్డ్‌ ఠాణా పరిధిలోని ఇమ్మడిహళ్లిలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. వివరాలు.. 

సువర్ణ (40), ఆమె కుమార్తె కారుణ్య (14) మృతులు. ఓ ఇంటిలో సువర్ణ కుటుంబం నివసిస్తోంది. మొదట కుమార్తెను గొంతుపిసికి చంపింది, ఆపై ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం నుంచి ఇంట్లో అలికిడి లేకపోవడంతో ఇరుగు పొరుగుకు అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా ఏదో జరిగినట్లు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి చూడగా తల్లీ కూతురు శవాలు కనిపించాయి. క్లూస్‌ టీంతో ఆధారాల కోసం గాలించారు. అక్కడ ఎలాంటి డెత్‌నోట్‌ దొరకలేదని సమాచారం.  

కారణాలపై సందిగ్ధం 
మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారణాలపై బంధుమిత్రులను విచారిస్తున్నారు. కుటుంబ సమస్యలా, ఆర్థిక ఇబ్బందులా, లేక మరేమైనా ఉన్నాయా? అనేది తేలాల్సి ఉంది. ఈ దుర్ఘటనతో ఇమ్మడిహళ్లిలో విషాదం నెలకొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement