నేను స్పృహలోనే ఉన్నా : మాజీ పోర్న్‌ స్టార్‌

Mia Khalifa Responded Over Regain Consciousness Placards - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి మాజీ పోర్న్‌ స్టార్‌ మియా ఖలీఫా మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆమె ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘‘ మానవ హక్కులకు భంగం కలిగేంతగా ఏం జరుగుతోందని న్యూఢిల్లీలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపేశారు’’ అని పేర్కొన్నారు. అనంతరం మరో ట్వీట్‌లో.. రైతులను పేయిడ్‌ యాక్టర్లు అంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తన మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ( రైతుల ఉద్యమానికి మాజీ పోర్న్‌ స్టార్‌ మద్దతు )

అయితే దీనిపై కొంతమంది వ్యక్తులు మండిపడ్డారు.‘‘మియా ఖలీఫా స్ప్రహలోకి రా!’’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్లకార్డులపై కూడా ఆమె స్పందించారు. శుక్రవారం ట్విటర్‌లో ‘‘ నేను స్పృహలోనే ఉన్నానని ధ్రువీకరిస్తున్నాను. మీరు అనవసరంగా నా మీద అక్కర చూపుతున్నందుకు కృతజ్ఞతలు. నేను ఇప్పటికీ రైతులకు మద్దతుగానే ఉన్నా’’ అని స్పష్టం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top