రైతుల ఉద్యమానికి మాజీ పోర్న్‌ స్టార్‌ మద్దతు

Mia Khalifa Extended Her Support To Farmers Protest - Sakshi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని నెలలుగా దేశ రాజధానిలో ఉద్యమం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమానికి దేశ, విదేశాల నుంచి మద్దతు లభిస్తోంది. పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు దీనిపై స్పందించారు. అమెరికన్‌ పాప్‌ సింగర్‌ రిహాన్నా, యువ పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్‌లు మంగళవారం ట్విటర్‌ ద్వారా తమ మద్ధతు తెలిపారు. తాజాగా ఈ లిస్ట్‌లో మాజీ పోర్న్‌ స్టార్‌ మియా ఖలీఫా చేరారు.

బుధవారం ట్విటర్‌లో ‘‘ మానవ హక్కులకు భంగం కలిగేంతగా ఏం జరుగుతోందని న్యూఢిల్లీలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపేశారు’’ అని పేర్కొన్నారు. అనంతరం మరో ట్వీట్‌లో.. రైతులను పేయిడ్‌ యాక్టర్లు అంటున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు తన మద్దతు తెలిపారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top