మూడు రోజుల్లో పోలింగ్‌..బీజేపీ నేతను కాల్చి చంపిన మావోయిస్టులు | Sakshi
Sakshi News home page

మూడు రోజుల్లో పోలింగ్‌..బీజేపీ నేతను కాల్చి చంపిన మావోయిస్టులు

Published Sat, Nov 4 2023 7:47 PM

maoists killed bjp leader in chattisgarh three days before polling - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ఫస్ట్ ఫేజ్‌ అసెంబ్లీ ఎన్నికలకు మూడు రోజుల ముందు మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న బీజేపీ నేతను కాల్చి చంపారు. నారాయణ్‌పూర్‌ జిల్లా కౌశల్‌నార్‌ ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది.

నారాయణ్‌పూర్‌ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా ఉన్న రతన్‌ దూబే ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఇంతలో మావోయిస్టులు వచ్చి ఒక్కసారిగా ఆయనపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో దూబే అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనాస్థలానికి ప్రత్యేక పోలీసుల టీమ్‌ వెళ్లి దర్యాప్తు చేస్తోందని సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 

Advertisement
Advertisement