మాంగల్య బలం గట్టిదే.. హుండీలోకి చేరబోయేది!

Mangalya Chain Lost And Came Back To Spouse in Karnataka - Sakshi

 పోగొట్టుకున్న వారం తరువాత మళ్లీ సొంతదారుకు అందజేత 

సాక్షి, బెంగళూరు: కొద్దిగా ఆలస్యమై ఉంటే ధర్మస్థల మంజునాథస్వామి హుండీలోకి చేరబోయే మాంగల్యం చైన్‌ నాటకీయ మలుపుల తరువాత మళ్లీ  సొంతదారుకు వశమైంది. వివరాలు.. చిక్కమంగళూరులో ఈ నెల 6వ తేదీన ఉపాధ్యాయురాలు హేమలత, భర్త యోగేశ్‌ తో కలిసి క్రీడామైదానంలో వాకింగ్‌ చేస్తుండగా తాళిబొట్టు చైన్‌ జారిపడిపోయింది. 11 గ్రాముల బరువున్న ఆ చైన్‌ వినోద్, రాఘవేంద్ర అనే ఇద్దరు యువకులకు దొరికింది. మాకు ఎవరిదో చైన్‌ దొరికింది, సొంతదారు సంప్రదించాలని ఆ యువకులు మైదానం చుట్టుపక్కల బోర్డులు పెట్టినా మూడునాలుగు రోజుల వరకూ స్పందన రాలేదు. దీంతో వారు చైన్‌ను ధర్మస్థల స్వామి హుండీలో వేయాలని బయల్దేరారు.  


మాంగల్యం చైన్‌ను దంపతులకు అప్పగిస్తున్న వినోద్, రాఘవేంద్ర

ధర్మస్థలకు వెళ్లాక ఫోన్‌..  
కాగా, దంపతులు వాకింగ్‌కు వెళ్లగా అక్కడ అమర్చిన ఫోన్‌ నంబర్లను గమనించి యువకులకు ఫోన్‌ చేశారు. ధర్మస్థల వెళ్లామని, తిరిగి వస్తామని బదులిచ్చారు. చివరికి ఊరికి చేరి దంపతులకు చైన్‌ అందివ్వగా, భర్త యోగేష్‌ భార్య మెడలో అలంకరించాడు. చైన్‌ పోవడంతో ఎంతో బాధపడ్డానని, తిరిగి దొరకడం ఎంతో ఆనందంగా ఉందని హేమలత చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top