ట్రిక్‌ టెస్ట్‌.. 5 నిమిషాల్లోనే రిజెక్ట్‌ చేశారు!

Man Gets Rejected From Job in 5 Minutes - Sakshi

న్యూఢిల్లీ: ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినపుడు చాలా మంది భయపడతారు. అలా భయపడటం సర్వసాధారణ విషయం. ఇక్కడ ఉద్యోగం వస్తుందా.. రాదా అనే టెన్షన్‌లో చాలామంది తమ ఇంటర్య్వూలో విఫలం అవుతూ ఉంటారు. ఇంటర్య్వూకి వెళ్లే ముందు బాగానే ప్రిపేర్‌ అయినా చిన్నచిన్న కారణాలతో వచ్చిన అవకాశాన్ని కోల్పోతూ ఉంటారు. మనం ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అక్కడ పని చేసే ప్రతి వ్యక్తిని గౌరవించడం ఎల్లప్పుడూ ముఖ్యం. అక్కడ మనని చాలా మంది గమనిస్తూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరితో మంచిగా మాట్లాడటం మంచిది. ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్లి "5 నిమిషాల్లోనే వెనక్కి వచ్చేశాడు. దీనికి సంబంధించి రెడ్డిట్‌ చేసిన పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. 

రెడ్డిట్ పోస్ట్ లో తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్వ్యూకి వెళ్లిన అభ్యర్థి అక్కడ తనని పలకరించిన "రిసెప్షనిస్ట్‌"తో అసభ్యంగా ప్రవర్తించాడనే కారణంతో ఉద్యోగానికి అతనని ఎంపిక చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ వ్యక్తిని పలకరించిన మహిళా రిసెప్షనిస్ట్ కాదు, ఆమె ఇంటర్వ్యూ తీసుకునే వ్యక్తి. ఆ మహిళా ఆలా ప్రవర్తించడానికి కారణం.. ఉద్యోగ ఎంపిక విషయంలో ఇది ఒక చిన్న పరీక్ష లాంటిది.  ఆ ట్రిక్‌ టెస్టులో విఫలం కావడంతో సదరు నిరుద్యోగి తన ఉద్యోగవకాశాన్ని కోల్పోయాడు. ట్రిక్‌ టెస్టులో భాగంగా రిసెప్షన్‌ వేష ధారణలో ఉన్న ఆమెతో మాట్లాడానికి అతను ఇష్టపడలేదు. ఆ ఉద్యోగి వచ్చిన వెంటనే  రిసెప్షన్‌ సీట్‌లో ఉన్న హైరింగ్‌ మేనేజర్‌ గౌరవంగా పలకరించినా అతను మాట్లాడటానికి ఆసక్తిచూపలేదు. ఆమె పలుమార్లు మాట్లాడటానికి ప్రయత్నించినా లైట్‌ తీసుకున్నాడు. ‘నీతో నాకు పనిలేదు’ అన్నట్లు ఆమె వైపు చూశాడు. తనే డెసిషన్ మేకర్ గా అన్నట్లుగా ప్రవర్తించాడు’. ఇదే అతను ఉద్యోగ అవకాశాన్ని కోల్పోవడానికి ప్రధాన కారణమైంది.

కానీ అభ్యర్థి గ్రహించని విషయం ఏమిటంటే "రిసెప్షనిస్ట్" తనని ఎంపిక చేసే వ్యక్తి అని.  ఈ సంభాషణ తర్వాత "ఆమె అతన్ని ఇంటర్వ్యూ చేసే గదికి పిలిచింది. తనతో ఇలా మాట్లాడింది.. మా బృందంలోని ప్రతి వ్యక్తి ఎంత విలువైన వారో అలాగే వారి యొక్క గౌరవ మర్యాదలు కూడా ముఖ్యం అని చెప్పింది. 'రిసెప్షనిస్ట్'తో అతని ప్రవర్తన కారణంగా తను ఈ పోస్ట్ కి అర్హుడు కాదని భావించింది. మీ విలువైన సమయానికి ధన్యవాదాలు, మీ ఇంటర్వ్యూ ముగిసింది" అని చెప్పి అతన్ని పంపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top