West Bengal: మమతా బెనర్జీ అ‍ల్లుడికి అందలం | Mamata Banerjee nephew Abhishek Appointed As TMC National General Secretary | Sakshi
Sakshi News home page

West Bengal: మమతా బెనర్జీ అ‍ల్లుడికి అందలం

Jun 5 2021 8:04 PM | Updated on Jun 5 2021 9:21 PM

Mamata Banerjee nephew  Abhishek Appointed As TMC National General Secretary - Sakshi

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ అల్లుడు అభిషేక్‌ బెనర్జీకి పార్టీలో కీలక పదవి లభించింది. టీఎంసీ పార్టీ జాతీయ కార్యదర్శిగా అభిషేక్‌ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు పార్టీ అధినేత్రి మమత బెనర్జీ. టీఎంసీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించి నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ ప్రకటించింది. 

ఒకరికి ఒకే పదవి
ఒక వ్యక్తికి ఒకే పదవి ఉండాలని వర్కింగ్‌ కమిటీ సమావేశంలో మమత నిర్ణయించినట్టు ఆ పార్టీ నేత పార్థ చటర్జీ తెలిపారు. దీని ప్రకారం అభిషేక్‌ బెనర్జీని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను సుబ్రతా బక్షి నిర్వహిస్తున్నారు. పార్టీ యువజన విభాగం బాధ్యతలను సయోని ఘోష్‌కి అప్పగించారు. 

విమర్శలకు వెరవక
విమర్శలకు ఘాటైన సమాధానం చెప్పడంలో మమత బెనర్జీతి ప్రత్యేక శైలి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు అభిషేక్‌ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ముఖ్యంగా సువేందు అధికారి అభిషేక్‌ను అవినీతికి అడ్రస్‌గా పేర్కొన్నారు. అయితే ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మమత తన అల్లుడికి కీలక బాధ్యతలు అప్పగించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement