Maharashtra: ‘వసూల్‌ రాజా’లకు ఫడ్నవీస్‌ వార్నింగ్‌ 

Maharashtra: Devendra Fadnavis Warns Strict Action On Extortionists In Mathadi Sector - Sakshi

సాక్షి, ముంబై: మాతాడి ప్రాంతంలో వేతన జీవులనుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ హెచ్చరించారు. నేవీముంబైలోని వేతన జీవులు ఆదివారం నిర్వహించిన ఓ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. వాషిలోని ఏపీఎంసీ మార్కెట్‌లో మాతాడి వర్కర్లు అంతర్భాగమని, వారి నుంచి ఇతరులెవరైనా బలవంతపు వసూళ్లకు పాల్పడితే కచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే మాతాడీ ప్రాంతంలో వేతన జీవులనుంచి వసూల్‌ రాజాలకు బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని అనేక ఫిర్యాదులు వచ్చాయని, వారి వల్ల మాతాడీ ప్రాంతానికి చెడ్డపేరు వస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ముంబైలోని వొర్లి–సెవ్రీ ఎలివేటెడ్‌ రోడ్‌ నిర్మాణంలో నిర్వాసితులైన వారి కష్టాలు వినేందుకు ఏక్‌నాథ్‌ శిందే రెండు కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top