పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా | Parliament Monsoon Session 2026 July 22nd Live Updates | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

విపక్షాల ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభ వాయిదా

  • పార్లమెంట్‌ ఉభయ సభలు రేపటికి వాయిదా

  • విపక్షాల ఆందోళనతో లోక్‌సభ, రాజ్యసభ వాయిదా

  • నీట్‌, విద్యార్థుల ర్యాలీలపై విపక్షాలు నిలదీత

2026-07-22 15:10:38

సాయంత్రం రాహుల్‌ ప్రెస్‌మీట్‌..

  • ధర్రేంద ప్రధాన్‌ రాజీనామా నిరసనల వేళ కీలక పరిణామం.. 
  • రాహుల్‌ గాంధీ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. 
  • రాహుల్‌ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. 
2026-07-22 13:39:17

స్పీకర్‌ను కలిసిన ధర్మేంద్ర ప్రధాన్‌

  • స్పీకర్‌ ఓం బిర్లాను కలిసిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని ఉభయ సభల్లో విపక్షాల ఆందోళనలు. 
2026-07-22 12:46:43

పార్లమెంట్‌కు చేరుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌

  • పార్లమెంట్‌కు చేరుకున్న ధర్మేంద్ర ప్రధాన్‌
  • లోక్‌సభ స్పీకర్‌ను కలవనున్న ధర్మేంద్ర ప్రధాన్‌
  • రాజీనామా చేస్తారా? అని ఉత్కంఠ
  • మరోవైపు.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్‌
2026-07-22 12:37:07

నీట్‌ పేపర్‌ లీక్‌పై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన

  • నీట్‌ పేపర్‌ లీక్‌పై లోక్‌సభలో కేంద్రం కీలక ప్రకటన
  • నీట్‌ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధం: కిరణ్‌ రిజుజు
  • ప్రభుత్వం పేపర్‌ లీక్‌పై చర్చకు సిద్ధంగా ఉంది.
  • విద్యార్థులే మాకు ప్రథమ ప్రాధాన్యం. 
  • మరోవైపు.. కేంద్రమంత్రి ధర్మేంద ప్రధాన్‌ రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్‌.
  • నీట్‌ పేపర్‌ లీక్‌పై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు: అఖిలేష్‌ యాదవ్‌
  • ముందు ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించండి.
  • ఆ తర్వాతే సభలో చర్చ జరగాలి.
  • మేం ప్రశ్నిస్తున్నది రాజకీయ అంశాలు కాదు, విద్యార్థుల సమస్యలే.
  • రాజీనామా తర్వాతే చర్చలకు సిద్ధమన్న అఖిలేష్‌ యాదవ్‌
  • ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన, నిరసనలు
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు విపక్షాల పట్టు. 
  • మధ్యాహ్నం రెండు గంటలకు ఉభయ సభలు వాయిదా

 

2026-07-22 12:17:04

లోక్‌సభ స్పీకర్‌తో కిరణ్‌ రిజుజు భేటీ..

  • లోక్‌సభ స్పీకర్‌తో కేంద్రమంత్రి కిరణ్‌ రిజుజు భేటీ
  • కాసేపట్లో నీట్‌పై చర్చకు సంబంధించి ప్రకటన చేయనున్న రిజుజు
  • మరోవైపు రాజ్యసభ చైర్మన్‌ను కలిసిన ఖర్గే
  • ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసిన ఖర్గే.
  • రాజీనామా తర్వాత చర్చ జరగాలన్న ఖర్గే. 
2026-07-22 11:33:53

కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు..

  • రాహుల్‌పై కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు.. 
  • మమత, రాహుల్‌ ప్రజాస్వామ్యవాదులు కాదు: గిరిరాజ్‌ సింగ్‌
  • అర్బన్‌ నక్సల్స్‌గా మారుతున్నారు.
  • విద్యార్థులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.
  • రాజ్యాంగ పదవిలో ఉన్న రాహుల్ గాంధీ తన చర్యల ద్వారా రాజ్యాంగ గౌరవాన్ని దెబ్బతీశారు.
  • రాహుల్ గాంధీ వ్యవహారశైలి అత్యంత ప్రమాదకరమైన ఉద్దేశాలను ప్రతిబింబిస్తోంది.
  • ఇతర దేశాల్లో జరిగిన పరిణామాలను అనుసరించి భారత్‌లో అశాంతి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు.
  • ప్రధానమంత్రి నివాసం సమీపంలో నిరసన చేపట్టడం అత్యంత బాధ్యతారహితమైన చర్య.
  • అక్కడ ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగి ఉంటే పరిస్థితులు తీవ్రంగా మారేవి.
  • ప్రధాని నివాసం సమీపంలో ఎవరైనా ప్రమాదకర వస్తువులు లేదా నిప్పు పెట్టే పదార్థాలు విసిరి ఉంటే తీవ్ర పరిణామాలు ఎదురయ్యేవి.
  • రాహుల్ గాంధీ చర్యల స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
2026-07-22 11:25:27

పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా

  • పార్లమెంట్‌ ఉభయ సభలు వాయిదా
  • నీట్‌, విద్యార్థుల విషయమై ఉభయ సభల్లో విపక్షాల నిరసనలు, ఆందోళన
  • ఉభయ సభలు కాసేపు వాయిదా. 
  • మూడో రోజు కొనసాగుతున్న వాయిదాల పర్వం. 
2026-07-22 11:11:36

నీట్ వివాదంపై అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు

  • నీట్ వివాదంపై అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
  • ఎంపీ అఖిలేష్ యాదవ్ నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వంపై ఫైర్‌.
  • సంబంధిత మంత్రిని ప్రభుత్వం ఎందుకు తొలగించడం లేదు?
  • ప్రభుత్వం తన మంత్రిని ఎందుకు తొలగించలేకపోతోందో ఆలోచించాలి.
  • ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి ఉంది? అని ప్రశ్నించారు.
  • ఆ మంత్రి ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా రహస్యాలు తెలుసుకున్నారా?
  • అందుకే చర్యలు తీసుకోవడం లేదా? అని వ్యాఖ్యానించారు.
  • నీట్ వ్యవహారంలో ప్రభుత్వం భయపడుతున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.
  • విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం బాధ్యత వహించాలి.
  • పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
2026-07-22 11:10:02

లోక్‌సభ కాసేపు వాయిదా..

  • మూడో రోజు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం.. 
  • సభలో విపక్ష ఎంపీల నిరసనలు 
  • విపక్షాల ఆందోళనతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసిన స్పీకర్‌
  • లోక్‌సభలో విపక్షాల ఆందోళనలు, నినాదాలు. 
2026-07-22 11:05:13

కేంద్రంపై ఖర్గే సీరియస్‌..

  • కేంద్రంపై ఖర్గే సీరియస్‌..
  • పార్లమెంట్‌ వద్ద మల్లికార్జున ఖర్గే కామెంట్స్‌.. 
  • దేశంలో నియంత పాలన సాగుతోంది.
  • కాంగ్రెస్‌ నేతలను, విద్యార్థులను ఈ ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోంది.
  • రాహుల్‌, ప్రియాంక పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు దారుణం.
  • విద్యార్థుల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది.
  • మేం ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేశాం. 

 

 

2026-07-22 11:01:16

కేంద్రంపై ప్రియాంక ఫైర్‌

  • పార్లమెంట్‌ వద్ద ప్రియాంక గాంధీ కామెంట్స్‌.. 
  • సభలో విపకక్షాలను మాట్లాడనివ్వడం లేదు: ప్రియాంక గాంధీ
  • విద్యార్థులు తమ భవిష్యత్‌ కోసం రోడ్కెక్కారు.
  • చర్చకు స్పీకర్‌కు ప్రభుత్వ అనుమతి కావాలంటున్నారు.
  • దేశంలో విద్యావ్యవస్థ కుప్పకూలిపోయింది.
  • దేశంలో ఉద్యోగాలు లేవు. నిరుద్యోగం పెరిగిపోయింది.
  • విద్యార్థులపై పోలీసులు దారుణంగా దాడి చేశారు.
  • ఈ యువకులంతా మోదీకి ఓటు వేసినవారే. 
  • ఉభయ సభల్లో విద్యార్థుల సమస్యలపై చర్చించాలని డిమాండ్‌.
  • ముక్కుకు గాయామైనా వెనక్కు తగ్గని రాహుల్‌.
  • నల్ల దుస్తుల్లో పార్లమెంట్‌కు వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీలు. 
  • పార్లమెంట్‌ ఎదుట ఇండియా కూటమి ఎంపీల నిరసనలు  
  • మరోవైపు.. జంతర్‌ మంతర్‌లో కొనసాగుతున్న సీజేపీ ఆందోళనలు.
2026-07-22 10:51:22

నల్లదుస్తులతో కాంగ్రెస్‌ ఎంపీల నిరసన

  • నల్లదుస్తులతో కాంగ్రెస్‌ ఎంపీల నిరసన
  • పార్లమెంట్‌ వద్ద నల్లదుస్తులతో కాంగ్రెస్‌ ఎంపీల నిరసన
  • నీట్‌ అవకతవకలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని డిమాండ్‌.
  • కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ జరిపించాలి

 

 

2026-07-22 10:36:15

వాంగ్‌చుక్‌ను కలవనున్న కేంద్రమంత్రులు

  • వాంగ్‌చుక్‌ను కలవనున్న కేంద్రమంత్రులు
  • సీజేపీ ప్రతినిధులతో నేడు మరోసారి భేటీకానున్న కేంద్రం
  • మరికాసేపట్లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ నేతృత్వంలో జరగనున్న సమావేశం
  • నిన్న రాత్రి వాంగ్‌చుక్‌ను కలిసిన కేంద్రమంత్రులు జితేంద్ర సింగ్‌, జేపీ నడ్డా
2026-07-22 10:36:15

మూడో రోజు పార్లమెంటు సమావేశాలు

  • మూడో రోజు పార్లమెంటు సమావేశాలు
  • నేడు మూడో రోజు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి.
  • ఉభయసభల సమావేశాలు సజావుగా సాగితే పలు బిల్లులపై చర్చ జరగనుంది.
  • సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య పెంపుపై లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది.
  • వందేమాతరం గీతానికి జాతీయహోదా కల్పిస్తూ రాజ్యసభలో బిల్లు పెట్టే అవకాశం ఉంది.
2026-07-22 10:36:15
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement