ఎల్‌ఐసీ నుంచి మరో కొత్త పథకం

LIC of India Launches New Bima Jyoti Plan - Sakshi

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ బీమా జ్యోతి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. నాన్‌లింక్‌డ్, నాన్‌పార్టీస్ పేటింగ్‌ వ్యక్తిగత పొదుపు పథకమిది. ఈ పథకం ద్వారా బీమా రక్షణతోపాటు పొదుపును సైతం కలిపిస్తునట్లు ఎల్‌ఐసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వివరాల ప్రకారం పథకం గడువు ముగిశాక హామీ ఇస్తున్న మొత్తాన్ని పాలసీదారుడికి ఎల్‌ఐసీ చెల్లించనుంది. ఒకవేళ గడువుకంటే ముందుగా దురదృష్టవ శాత్తూ పాలసీదారు మరణిస్తే ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక మద్దతును అందివ్వనుంది. హామీలో భాగంగా తీసుకున్న పాలసీ(బేసిక్‌) విలువపై ప్రతీ ఏడాది చివర్లో రూ. 1,000కి రూ. 50 చొప్పున జమ (గ్యారంటీడ్‌ ఎడిషన్స్‌) చేయనుంది. రిస్క్‌ ప్రారంభమయ్యాక పాలసీ కాలంలో దురదృష్టవశాత్తూ పాలసీదారు మరణిస్తే.. నిబంధనల ప్రకారం బీమా విలువతోపాటు, అప్పటివరకూ జమ అయిన అదనపు మొత్తాన్ని చెల్లించనుంది.

చదవండి:

ఏప్రిల్‌ 1 నుంచి పీఎఫ్‌ కొత్త నిబంధనలు

పెట్రోల్ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top