ఫార్చునర్ కారు కట్నంగా ఇవ్వలేదని పెళ్లి రద్దు చేసుకున్న లెక్చరర్..

Up Lecturer Cancel Wedding After Not Getting Fortuner Car Dowry - Sakshi

లక్నో: తాను అడిగిన ఫార్చునర్ కారును కట్నంగా ఇవ్వలేదని పెళ్లినే రద్దు చేసుకున్నాడు ఓ ప్రభుత్వ కళాశాల లెక్చరర్. ఈ వివాహం తనకు వద్దని పెళ్లికుతూరుకు మెసేజ్ చేసి చెప్పాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. పెళ్లికొడుకుపై కేసు పెట్టారు. 

ఉత్తర్‌ప్రదేశ్ ఘాజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పెళ్లికొడుకు పేరు సిద్ధార్థ్ విహార్. ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఓ అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. అయితే తనకు కట్నంగా  ఫార్చునర్ కారు ఇవ్వాలని అతడు డిమాండ్ చేశాడు.

అమ్మాయి తల్లిదండ్రులు మాత్రం వాగన్ఆర్ కారును బుక్ చేశారు. ఈ విషయం తెలిసిన పెళ్లికొడుకు కుటుంబసభ్యులు తమకు ఫార్చునర్ కారే కావాలని పట్టుబట్టారు. కానీ పెళ్లికూతురు కుటుంబం మాత్రం వాగన్ఆర్ మాత్రమే ఇప్పిస్తామని చెప్పింది. దీంతో ఈ పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు వధువుకు మేసేజ్‌ ద్వారా తెలియజేశాడు వరుడు.

మరో ఘటనలో పెళ్లికొడుకు నచ్చలేదని..
అంతకుముందు ఉత్తర్‌ప్రదేశ్ ఇటావాలో కూడా ఓ పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. పెళ్లిమండపంలో దండలు మార్చుకున్న తర్వాత ఓ పెళ్లికూతురు అనూహ్యంగా పెళ్లి రద్దు చేసుకుంది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పెళ్లి చూపుల్లో తాను చూసిన అబ్బాయి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్న అబ్బాయి వేరని వధువు చెప్పింది. ఈ అబ్బాయి నల్లగా ఉన్నాడని, తనకు నచ్చలేదని పేర్కొంది. 

ఇక చేసేదేమీ లేక పెళ్లికొడుకు కుటుంబం కూడా పెళ్లిని రద్దు చేసుకునేందుకు అంగీకరించింది. అయితే తాము పెళ్లికూతురుకు పెట్టిన నగలు తిరిగి ఇవ్వలేదని వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి ఏర్పాట్లకు రూ.లక్షలు ఖర్చు అయ్యాయని తెలిపారు.
చదవండి: స్వలింగసంపర్క వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top