కాల్చేస్తాం, జరిమానా కట్టేస్తాం 

Karnataka Tops The List People Caught Smoking In Public Places - Sakshi

సాక్షి, బెంగళూరు: ధూమపానం అటు ఆరోగ్యాన్ని, ఇటు జేబును నాశనం చేస్తుందని ఎందరు హితోక్తులు చెప్పినా ధూమపాన ప్రియులు చెవికెక్కించుకోవడం లేదు. రాష్ట్రంలో ధూమపానం చేసేవారి సంఖ్య పెరగడమే దీనికి నిదర్శనం. దేశంలోనే అగ్రస్థానంలో కన్నడనాడు నిలిచింది. పబ్లిక్‌ స్థలాల్లో పొగతాగుతూ పట్టుబడిన వారి జాబితాలోనూ కర్ణాటకదే తొలిస్థానం. సుమారు 35 శాతంతో కర్ణాటక ఇందులో పై వరుసలో ఉంది. ఎన్నిసార్లు జరిమానాలు విధిస్తున్నప్పటికీ పబ్లిక్‌ ప్రాంతాల్లో ధూమపానం చేయడం మాత్రం ఆగడం లేదు. కర్ణాటక తర్వాత స్థానంలో కేరళ ఉంది. గడిచిన మూడేళ్లలో 5.07 లక్షల మంది పొగ తాగుతూ దొరికిపోయి జరిమానా కట్టారు.  

కోట్పా చట్టం చూస్తోంది  

  •  సిగరెట్, పొగాకు ఉత్పత్తుల చట్టం (కోట్పా) అమల్లో ఉంది. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడం ఈ చట్టరీత్యా నేరం. కానీ ధూమపానప్రియులు యథావిధిగా రద్దీ ప్రాంతాల్లో పొగాకు కాలుస్తున్నారు. టీ స్టాళ్లు, పాన్‌ దుకాణాలు, పార్కులు, వీధుల్లో ఇది అధికంగా ఉంది. 
  • అధికారుల తనిఖీలలో దొరికితే ఈ నేరానికి రూ. 200 జరిమానా విధిస్తున్నారు.  
  • పొగరాయుళ్లు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదని తూర్పు జోన్‌ డీసీపీ శరణప్ప తెలిపారు.  

5.07 లక్షల జరిమానాలు  

  • 2019 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు దేశంలో మొత్తం 14.40 లక్షల మంది బహిరంగ ప్రాంతాల్లో ధూమపానం చేసి జరిమానాలు చెల్లించారు.  
  • ఇందులో కర్ణాటక నుంచే సుమారు 5.07 లక్షల మంది ఉండడం గమనార్హం. దేశంలోని మొత్తం కేసులతో పోలిస్తే 35 శాతం ఒక్క బెంగళూరు నుంచే ఉన్నాయి. 
  • మొత్తం జరిమానాల్లో 50 శాతం కర్ణాటక, కేరళ రాష్ట్రాల వాటానే ఉంది. 

(చదవండి: చాటింగ్, హాట్‌ ఫొటోలతో పారిశ్రామికవేత్తకు టోకరా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top