ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌ గుర్తించి, ఏకంగా 22 లక్షలు దక్కించుకున్నాడు!

Indian Hacker Wins Huge Money From Facebook Highlighting Instagram Bug - Sakshi

సాక్షి, ముంబై: ప్రస్తుత ఇంటర్నెట్‌ యుగంలో ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌ల్లో అకౌంట్‌ లేని వారు చాలా అరుదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలతో మమేకమవ్వడానికి ఈ యాప్స్‌ ఎంతగానో ఉపయోగపడతాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రమ్‌ వంటి సోషల్‌ మీడియా యాప్స్‌ నెటిజన్ల ప్రైవేసి విషయంలో అసలు రాజీ పడవు. అప్పుడప్పుడు ఈ సోషల్‌ మీడియా యాప్స్‌లో లోపాలు వెలుగులోకి వస్తూంటాయి. కొన్ని సందర్బాల్లో  సోషల్‌ మీడియా యాప్స్‌లో ఉన్న లోపాలను కొంతమంది ఎథికల్‌ హకర్స్‌ వెలుగులోకి తెస్తుంటారు. వాటిని వెంటనే గుర్తించి, ఆయా కంపెనీలకు తెలియజేస్తారు. 

కాగా తాజాగా ముంబై షోలాపుర్‌కు చెందిన మయూర్‌ ఫార్టేడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్‌ను గుర్తించాడు. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌కు రిపోర్ట్‌ చేశాడు. ఫేస్‌బుక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్‌ను నిరూపించమని తిరిగి అతని కోరగా అందుకు తగిన ఆధారాలను చూపిస్తూ ఫేస్‌బుక్‌కు తెలియజేశాడు. దీంతో ఫేస్‌బుక్‌ కంపెనీ ఇన్‌స్టాగ్రమ్‌లో లోపం ఉందని నిర్ధారించింది. బగ్‌ను గుర్తించినందుకుగాను ఫేస్‌బుక్‌ మయూర్‌ ఫార్టేడ్‌ కు భారీ నజరానాను అందించింది. సుమారు రూ. 22 లక్షలను మయూర్‌కు అందించింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న బగ్‌ ఏంటీ..?
ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్లు తమ అకౌంట్‌ విషయంలో గోప్యతను పాటించేందుకు ప్రైవేటు అకౌంట్‌గా మార్చుకుంటారు. ఈ బగ్‌ కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు అకౌంట్‌లో ఉన్న యూజర్ల అర్కవైడ్‌ పోస్ట్‌లు, స్టోరీస్‌, రిల్స్‌ వీడియోలను చూడవచ్చునని మయూర్‌ తెలిపాడు. దీంతో యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లుత్తుంది.

చదవండి: శరీరాన్ని ఉపయోగించి స్మార్ట్‌వాచ్‌ ఛార్జింగ్‌..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top