లద్దాఖ్‌లో ఇగ్లా క్షిపణుల మోహరింపు

Indian Gets Russian IGLA Air Defence Missile To Counter China - Sakshi

న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.  తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇప్పటికే హెలికాప్టర్లను మోహరించి కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో భారత్‌ బలగాలు ఎక్కడికైనా మోసుకుపోగలిగే పోర్టబుల్‌ ఇగ్లా క్షిపణుల్ని అత్యంత ఎత్తయిన ప్రాంతాల్లో మోహరించాయి.  సైనికులు భుజం మీద మోస్తూనే ఈ క్షిపణులతో శత్రువులపై గుళ్ల వర్షం కురిపించవచ్చు.(చదవండి : వినకుంటే సైనిక చర్యే.. చైనాకు రావత్‌ వార్నింగ్‌)

ఈ క్షిపణి వ్యవస్థను ఆర్మీ, వైమానిక దళం వినియోగిస్తాయి. చైనా సైన్యం కదలికల్ని అనుక్షణం కనిపెట్టేందుకు నిఘాను పెంచారు. భూమ్మీద నుంచే గగన తలంలో జరిగే ప్రతీ కదలికను పసిగట్టేందుకు రాడార్లు ఏర్పాటు చేశారు. దౌత్య చర్చలు విఫలమైతే సైనిక చర్యలు తప్పవంటూ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ హెచ్చరికలు జారీ చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top