IBPS Clerk 2021 Notification, Bank Clerk Eligibility Selection Criteria Details - Sakshi
Sakshi News home page

5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌

Published Mon, Jul 12 2021 12:29 PM

IBPS Clerk 2021 Notification: Vacancies, Eligibility, Selection Criteria Details Here - Sakshi

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు. 

► మొత్తం పోస్టుల సంఖ్య: 5830
► తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణలో ఖాళీల సంఖ్య:263, ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీల సంఖ్య: 263

భర్తీ చేసే బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా. 

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రాష్ట్ర అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. 

వయసు: 01.07.2021 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. 

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ విధానంలో ప్రిలిమినరీ(100మార్కులు), మెయిన్‌(200మార్కులు) పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. నెగిటివ్‌ మార్కుల విధానం ఉంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌లో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

దరఖాస్తుల ప్రారంభ తేది: 12.07.2021

దరఖాస్తులకు చివరి తేది: 01.08.2021

► ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 28, 29, సెప్టెంబర్‌ 4. 

► ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష: 31.10.2021

► వెబ్‌సైట్‌: https://www.ibps.in/

Advertisement
Advertisement