రెడ్ అలర్ట్: ముంచుకొస్తున్న తుపాను..

Heavy Rains Along The Kerala And Karnataka - Sakshi

కేరళ, కర్ణాటక పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు

కొల్లాం జిల్లాలో తుపాను ధాటికి నేలకొరిగిన చెట్లు

గుజరాత్ తీరం వైపు కదులుతూ బలపడుతున్న తుపాను

కేరళ: తౌక్టే తుపాను నేపథ్యంలో కేరళలో రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. కేరళ, కర్ణాటక పశ్చిమ తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొల్లాం జిల్లాలో తుపాను ధాటికి చెట్లు నేలకొరిగాయి. వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కేరళలో లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు  చేరుకున్నాయి. గోవాకు 350 కి.మీ దూరంలో  తుపాను కేంద్రీకృతమై ఉంది. తౌక్టే తుపాను గుజరాత్ తీరం వైపు కదులుతూ బలపడుతుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.

చదవండి: Arabian Sea: వాయుగుండంగా మారిన అల్పపీడనం 
Israel vs Hamas: కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు! 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top